Big Stories

Vicky Kaushal: కత్రీనా ప్రెగ్నెంట్.. క్లారిటీ ఇచ్చిన భర్త విక్కీ కౌశల్

Vicky Kaushal: బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో విక్కీ కౌశల్- కత్రీనా కైఫ్ జంట ఒకటి. 2021 లో ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న కత్రీనా.. తన కన్నా చిన్నవాడు అయినా విక్కీని ప్రేమించి గ్రాండ్ గా పెళ్లాడింది. పెళ్లి అయిన మూడు నెలల నుంచే కత్రీనా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే.

- Advertisement -

ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ప్రతిసారి ఆమె పొట్ట ఎత్తుగా ఉందని, లూజ్ డ్రెస్ వేసుకుంది ప్రెగ్నెంట్ అని, బుగ్గలు వచ్చి, బరువు పెరిగింది ప్రెగ్నెంట్ అనుకుంటా అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయమై కత్రీనా ఎప్పుడు స్పందించింది లేదు. పెళ్లి తరువాత నుంచి విక్కీ – కత్రీనా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడ్డారు.

- Advertisement -

ఇక కత్రీనా ప్రెగ్నెంట్ వార్తలపై విక్కీ మొదటిసారి స్పందించాడు. ఆయన నటించిన కొత్త చిత్రం బ్యాడ్ న్యూజ్. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ సరసన అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విక్కీకి.. తన భార్య ప్రెగ్నెంట్ పుకార్లు వినిపించాయి.

ఇక దీనికి ఆయన సమాధానమిస్తూ.. ” మా జీవితంలో గుడ్ న్యూస్ ఉంటే మొదట మీకే చెప్తాము.. ప్రస్తుతానికి మాత్రం మీరు మా బ్యాడ్ న్యూజ్ ను ఎంజాయ్ చేయండి” అని చెప్పుకొచ్చాడు. అంటే కత్రీనా ప్రెగ్నెంట్ కాదు అని చెప్పకనే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే కత్రీనా సైతం వరుస సినిమాలతో బిజీగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News