Big Stories

Vijay Thalapathy – Goat Movie Special Video: విజయ్ బర్త్ డే.. కొత్త సినిమా స్పెషల్ వీడియో మామూలుగా లేదుగా..

Thalapathy Vijay Birthday Special Video(Cinema news in telugu): దళపతి విజయ్.. ఈ పేరు వినగానే కోలీవుడ్‌ సహా టాలీవుడ్ సినీ ప్రియుల్లో ఏదో తెలియని ఉత్సాహం. ఆయన మాస్ యాక్షన్ స్టైల్‌కు అభిమానులు ఫిదా అయిపోతారు. గతేడాది ‘లియో’ మూవీతో వచ్చిన విజయ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం కొల్లగొట్టింది.

- Advertisement -

ఈ మూవీ తర్వాత విజయ్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ సారి భారీ బడ్జెట్‌తో GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో 68వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

- Advertisement -

Also Read: ఏంది మచ్చా.. ‘క‌ల్కి’లో రెమ్యున‌రేష‌న్ల‌కే అంత ఖ‌ర్చు అయిందా.. ప్రభాస్ అంత తీసుకున్నాడా..?

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే ఇది వరకు రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకొని సూపర్ డూపర్ బజ్ క్రియేట్ చేసింది. కాగా ఇవాళ దళపతి విజయ్ బర్త్. ఈ సందర్భంగా ‘గోట్’ మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ మేకర్స్ అందించారు. ఈ మేరకు మూవీకి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది.

ఈ స్పెషల్ వీడియో ప్రకారం.. విజయ్ డబుల్ రోల్‌లో కనిపించి అదరగొట్టేసాడు. అంతేకాకుండా బైక్‌పై ఛేజింగ్ చేసుకుంటూ వెళ్తున్న యాక్షన్ సీన్లు ఓ లెవెల్లో ఉన్నాయి. ఈ స్పెషల్ వీడియో చూస్తుంటే.. సినిమా మాస్ యాక్షన్ సీన్లతో బాక్సాఫీసు వద్ద భారీ విజయ్ సాధించేటట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియో ప్రకారం.. ముందుగా ఫైట్ ఛేజింగ్‌లో విజయ్ బైక్‌ను కొందరు వెంబడిస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో విజయ్ రైడింగ్ అత్యద్భుతంగా ఉంది. ఇందులో వీరు తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. మొత్తంగా విజయ్ బర్త్ డే ట్రీట్ అయితే సినీ అభిమానుల్ని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News