Big Stories

Vijay Devarakonda’s Surprise Role: జస్ట్ క్యామియోకే ఇంత రచ్చనా.. అర్జునా.. ఏం చేశావయ్యా..?

Vijay Devarakonda’s Surprise Role in kalki 2898 AD: సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం.. అర్జునా .. అర్జునా అంటూ ఫ్యాన్స్ అరిచి గోల చేస్తున్నారు. అంతలా అర్జునుడు ఎవరు.. ? కల్కి క్లైమాక్స్ ను తన భుజ స్కంధాలపై మోసింది ఎవరు..? క్లైమాక్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన హీరో ఎవరు.. ? అని అనుకుంటున్నారా.. ? ఇంకెవరు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాతనే పెళ్లి చూపులు కథ ఓకే చేశాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతోంది. ఇక మహానటి చిత్రంలో కూడా విజయ్ కీలక పాత్ర పోషించాడు. నాగీ ఎప్పుడు పిలిచినా.. అది ఎంత చిన్న పాత్ర అయినా కూడా విజయ్ నో చెప్పడు. దానికి నిదర్శనమే ఈ అర్జునుడు.

- Advertisement -

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898AD. నేడు రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఎంతోమంది స్టార్ క్యాస్టింగ్ ఉంది. మృణాల్ ఠాకూర్, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లా.. ఇలా ఇంతమంది ఉన్నా వారి పాత్రలు గెస్ట్ రోల్స్ గానే ఉన్నాయి. కానీ, చివర్లో విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం కల్కి సెకండ్ పార్ట్ కు తెరలేపింది.

Also Read: కల్కి రివ్యూ.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికేసినట్టే..

కురుక్షేత్రంలో అర్జునుడుగా.. అశ్వత్థామపై బాణాన్ని ఎక్కుపెట్టి.. కృష్ణుడితో మాట్లాడే అద్భుతమైన పాత్రను విజయ్ కొట్టేశాడు. అంతేనా కర్ణుడితో ఢీ కొట్టే అర్జునుడిగా విజయ్ నటన అద్భుతం. చూసావా కేశవ అంటూ కృష్ణుడిపైనే కోపం చూపించే పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. ఒక పక్క ప్రభాస్.. ఇంకోపక్క విజయ్.. ఇద్దరు బాణాలు వేసుకుంటూ యుద్ధం చేస్తుంటే చూడటానికి అభిమానులకు రెండు కళ్లు సరిపోలేదు.

నిజం చెప్పాలంటే.. ఆ పాత్రలో ఇంకెవరు ఉన్నా ఇంతగా హైప్ క్రియేట్ కాదేమో అని చెప్పాలి. ఇక కర్ణగా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే.. సెకండ్ పార్ట్ కు హింట్ ఇచ్చేసి వదిలేశాడు నాగీ. నిజం చెప్పాలంటే విజయ్ కు ఈ పాత్ర ఎంతో గుర్తింపును అందించిందనే చెప్పాలి. లైగర్ తరువాత విజయ్.. ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది అంతే. కల్కి ఫస్ట్ షో పడినప్పటినుంచి విజయ్ పేరు మారుమ్రోగిపోతుంది. థియేటర్ లో విజయ్ ను చూడగానే ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Also Read: Prabhas – NTR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. కల్కిలో ప్రభాస్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే..?

విజయ్ నటించిన సినిమాకు కూడా ఇంతలా పేరు రాలేదు. కేవలం అతిథి పాత్రకే ఇంత గుర్తింపు రావడం అద్భుతమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News