Big Stories

Naga Shourya: దర్శన్ కు సపోర్ట్ చేసి ఉన్న మంచి పేరును కూడా పోగొట్టుకున్న హీరో..

Naga Shourya: కన్నడ నటుడు దర్శన్ గురించి ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్పుకొచ్చేస్తున్నారు. అతడు చేసిన నేరాలు ఘోరాలు చిట్టా విప్పుతున్నారు. ఒక స్టార్ హీరోగా అతను ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడో.. ఒకే ఒక్క తప్పు చేసి అందరి చేత విమర్శలు అందుకుంటున్నాడు. ప్రియురాలు పవిత్ర గౌడను అసభ్యంగా కామెంట్ చేసినందుకు అభిమాని అయిన రేణుకా స్వామిని దర్శన్ ఎంత కిరాతకంగా చంపాడో అందరికి తెల్సిందే.

- Advertisement -

తన సినిమా ద్వారా ఎన్నో మంచి విషయాలను చెప్పిన దర్శన్.. ఇలా ఒక హత్య చేయడం, అది కూడా ఇంత దారుణంగా ఒక మనిషిని చంపడం అనేది క్షమించతగ్గది కాదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అతడికి కఠినశిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఈ కేసు తరువాత దర్శన్ ఆగడాలు ఒక్కొకటిగా బయటపడుతూ వచ్చాయి. దర్శన్ అరెస్ట్ పై కొంతమంది స్టార్స్ పాజిటివ్ గా మాట్లాడారు.. ఇంకొంతమంది నెగటివ్ గా మాట్లాడారు. అయితే ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఈ కేసు గురించి మాట్లాడలేదు.

- Advertisement -

తాజాగా కుర్ర హీరో నాగ శౌర్య మొదటిసారి దర్శన్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దర్శన్ మంచివాడు.. ఇలాంటి పని చేయడు అంటూ శౌర్య ఆయన గురించి పోస్ట్ పెట్టడం నెట్టింట కలకలం రేపుతోంది.

” హత్య చేయబడ్డ వ్యక్తి కుటుంబం గురించి వింటే నా గుండె ముక్కలవుతుంది. ఈ కష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికీ హానీ తలపెట్టడు. అతడి మంచితనంతో ఎంతో మందికి సాయం చేశాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకముంది. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి.

దర్శన్ పై వస్తున్న ఆరోపణల్లో నిజాలు తెలియకుండా అతడిపై విమర్శలు చేయడం, ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదనిపిస్తుంది. దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం నాకు ఉంది. నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారు. ఈ అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీకి ఎంతో ఆవేదన, భాద కలుగుతుంది. ఈ కఠిన పరిస్థితుల్లో వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ కలకలం రేపుతోంది.

దర్శన్ ఎలాంటివాడో తెలిసి కూడా నీకు సపోర్ట్ ఎలా చేయబుద్ది అవుతుంది అని అభిమానులు శౌర్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటి విషయాలలో తలదూర్చడం నీకు అవసరమా.. ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం.. ఇప్పటివరకు నీ మీద కాస్తో కూస్తో అభిమానము ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది అంరూ కామెంట్స్ పెడుతున్నారు. ప్లాప్స్ లో ఉన్నప్పుడు శౌర్య ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో జోక్యం చేసుకొని విమర్శల పాలు అవ్వడం కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News