Big Stories

Tanikella Bharani: టీనేజ్ లో లవ్.. నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు..

- Advertisement -

Tanikella Bharani: నటుడు, రచయిత, డైరెక్టర్, కవి తనికెళ్ల భరణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ సినిమాతో నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించిన ఆయన ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక కవిగా ఆయన కవిత్వానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అనే కవిత్వానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శివుని గురించి చెప్పాలంటే తనికెళ్ల భరణినే చెప్పాలి. శివుని గొప్పతనం గురించి ఆయన చెప్పే వ్యాఖ్యలు, పద్యాలు చెప్తూ ఉంటే తన్మయంతో అలా వింటూ ఉండిపోవడమే.

- Advertisement -

ఇక నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా ఆయన ఒక మంచి సినిమాను తెరకెక్కించారు. అదే మిధునం. ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ జంటగా నటించిన ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అవార్డులను తీసుకొచ్చిపెట్టింది. ఇక తనికెళ్ల భరణి చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. తాజాగా సింగర్ శ్రావణ భార్గవి పాడ్ కాస్ట్ ను ప్రారంభించింది. మొదట సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మొదటి ఎపిసోడ్ ను విజయవంతంగా పూర్తిచేసిన ఆమె.. రెండో ఎపిసోడ్ లో తనికెళ్ల భరణిని గెస్ట్ గా పిలిచింది.

ఇక ఈ రెండో ఎపిసోడ్ ప్రోమో తాజాగా శ్రావణభార్గవి తన యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తనికెళ్ల భరణి చిన్ననాటి సంగతులు అన్ని నెమరువేసుకున్నారు. టీనేజ్ లవ్, క్రష్ గురించి, లైఫ్ గురించి, మరణం గురించి చెప్పుకొచ్చారు. మరణం గురించి ఆలోచించి తీరాలనిచెప్తూ.. శివుని పద్యాన్ని అందుకున్నారు. ఇక చిన్నతనంలో తాను చాలా అల్లరివాడినని, ఒకసారి తనను చెట్టుకు కట్టేసి కొట్టారు అని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News