Big Stories

Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ ఫహద్ ఫాసిల్‌పై కేసు నమోదు.. ఏమైందంటే..?

Fahadh Faasil: సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. హీరోగా అయినా విలన్‌గా అయినా యాక్టింగ్‌తో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించే నటుడు ఫహద్ ఫాసిల్. ఈ మలయాళ స్టార్ హీరో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇక ఈ యాక్టర్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులోనూ ఎన్నో సినిమాలు చేశాడు. కానీ పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిపోయాడు.

- Advertisement -

‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్‌తో మరింత పాపులర్ అయిపోయాడు. ఈ మూవీలో భన్వార్‌సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు పుష్ప2 లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఇటీవలే ఫహద్ ‘ఆవేశం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ మూవీ థియేటర్లలో ఊహించని రెస్పాన్స్‌ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

- Advertisement -

ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. యాక్టింగ్‌లోనే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నాడు. ఇలా ఓ వైపు యాక్టర్‌గా ఉంటూ మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్న ఫహద్ పై తాజాగా కేసు నమోదు అయింది. కేరళ మానవ హక్కుల సంఘం అతడిపై సుమోటోగా కేసు పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: ఘోరంగా పడిపోయిన ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ డే కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

ఫహాద్ ఫాసిల్ ప్రస్తుతం ‘పింకెలీ’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి అంగమలైలోని ఎర్నాకులం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో హాస్పిటల్‌ ఉన్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. రాత్రి మొత్తం ఆ హాస్పిటల్‌లో షూటింగ్ నిర్వహించడంతో పేషెంట్లు నిద్రకు కరువై.. తీవ్ర ఇబ్బందులు పడ్డారని సమాచారం.

అంతేకాకుండా ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లి షూటింగ్ చేశారట. దీంతో ఎర్నాకుళం జిల్లా వైద్యురాలు బీనా కుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూమ్‌లో చిత్రీకరణకు ఎలా అనుమతి ఇచ్చారని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 7 రోజుల్లోగా తనకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ షూటింగ్ సమయంలో ప్రమాదకర స్థితిలో ఉన్నవారిని అత్యవరసర గదికి తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారని వస్తున్న ఆరోపణలపై నిర్మాతల సంఘం ఖండించింది. ఇలా మొత్తంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా చూసిన కేరళ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్.. ‘పింకెలి’ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ ఫహద్ ఫాసిల్‌పై కేసు పెట్టింది. త్వరలో ఫహద్ ఫాసిల్ కోర్టులో హాజరుకానున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News