EPAPER

Rajamouli: టైమ్స్ జాబితాలో జక్కన్న.. ఆ 100 మందిలో మనోడు..

Rajamouli: టైమ్స్ జాబితాలో జక్కన్న.. ఆ 100 మందిలో మనోడు..
SS-Rajamouli-time100

Rajamouli latest news(Tollywood Updates): రాజమౌళి. ఇప్పుడా పేరే ఓ సెన్సెషనల్. అసాధ్యాలను సుసాధ్యం చేయగల మగధీరుడు. టాలీవుడ్ సినిమాకు 2వేల కోట్ల మార్కెట్‌ను పరిచయం చేయాలన్నా.. అస్కార్‌ కలను సహకారం చేయాలన్నా ఆ ఘనత రాజమౌళికే దక్కింది. బాహుబలి, RRR సినిమాలతో భారతీయ సినిమాల ఖ్యాతిని ఖండాతరాలకు విస్తరించాడు జక్కన్న. ఇలా సెస్సెషనల్ డైరెక్టర్‌గా ప్రశంసలు పొందుతున్న రాజమౌళి ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది.


అత్యంత ప్రజాధారణ కలిగిన టైమ్‌ మ్యాగజీన్‌ రిలీజ్​ చేసిన టైమ్- 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023 జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తుల జాబితాలో ఒకరిగా నిలిచారు జక్కన్న. ఈ లిస్ట్​లో రాజమౌళితో పాటు బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్​ కూడా ప్లేస్​ సంపాదించుకున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వీరిద్దరికే అవకాశం దక్కడం విశేషం. పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులతో కూడిన జాబితాను ‘టైమ్స్‌’ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఎలాన్‌ మస్క్‌, హాలీవుడ్‌ తార ఏంజెలా బాసెట్‌, ప్రఖ్యాత రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మి, బుల్లితెర ప్రయోక్త తదితరులకు చోటు దక్కింది.

టైమ్- 100 ప్రభావవంతమైన వ్యక్తుల లిస్టులో చోటు సంపాదించుకున్న తొలి భారతీయ దర్శకుడు రాజమౌళినే. చాలా లోతైన అధ్యయనం, విపరీతమైన వడబోత తర్వాత ఈ లిస్టు తయారవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఆస్కార్ స్థాయి గుర్తింపుగా భావిస్తారు సెలెబ్రిటీలు. అలాంటి టైమ్స్ లిస్టు టాప్ 100లో చోటు దక్కించుకోవడం భారతీయ సినిమాతో పాటు..టాలీవుడ్ ఎంతో గర్వకారణం అని చెప్పొచ్చు.


ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం ఈ విజయానికి కారణంగా నిలిచింది. గోల్డెన్ గ్లొబ్ అవార్డుల్లో విజేతగా నిలవడం, స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ క్యామరూన్ లాంటి దిగ్గజాలు స్వయానా మెచ్చుకోవడం రాజమౌళి వైపు వరల్డ్ మీడియా చూసేలా చేసింది. యుఎస్ నుంచి జపాన్ దాకా ట్రిపులార్ అందుకున్న ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.

భారతీయ సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప డైరెక్టర్లు ఉన్నాయి. కానీ వాళ్లెవరికి సాధ్యం కానీ ఫీట్‌ను రాజమౌళి సాధించారు. భారతీయ సినీ హిస్టరీలో టైమ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న తొలి డైరెక్టర్‌గా తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ స్టార్ కూడా ఆయనే. స్టార్ హీరోలకు దక్కని.. ఛాన్స్‌ను రాజమౌళి కొట్టేసారు. ఒక ఇండియన్ ఫిలిం మేకర్ కు ఇలాంటి గౌరవం దక్కడం అరుదు.

రాజమౌళి గురించి టైమ్ కవర్ పేజీలో తన అభిప్రాయాలను పంచుకుంది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే స్కూల్ కి వెళ్ళినట్టే, చాలా అంశాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్ సినిమాతో అందర్నీ ఒకటి చేశాడని ఆలియా ప్రశంసలు గుప్పించింది. నేను అతన్ని మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తాను అని తెలిపింది. ఓ సారి రాజమౌళిని యాక్టింగ్ గురించి సలహా అడిగాను. మీరు ఏ క్యారెక్టర్ తీసుకున్నా దాన్ని ప్రేమతో చేయండి, ఎందుకంటే సినిమా ఫెయిల్ అయినా మీ క్యారెక్టర్ మాత్రం జనాల్లో మిగిలిపోతుందని రాజమౌళి చెప్పారని ఆలియా భట్ తెలిపింది.

Related News

Ka Movie: క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది.. ఇదుగో ఆన్సర్.. ?

Lokesh Kanagaraj : ప్రతి డైరెక్టర్ మిగతా సినిమాలను కూడా సపోర్ట్ చేయాలి

Akkineni Nagarjuna: కొడుకు పెళ్లి.. మరోసారి నాగ్ N కన్వెన్షన్ పై చర్చ.. ?

Animal Park: ‘యానిమల్ పార్క్’ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత

Allu Arvind: పండక్కి సినిమా రిలీజ్ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు

Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?

Somy Ali on Sushant Death: సుశాంత్ మరణం పై సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?

Big Stories

×