E-Paper
Advertisement

Mahesh Babu : SSMB 29 కోసం జ‌క్క‌న సూప‌ర్ స్కెచ్‌

Mahesh Babu : SSMB 29 కోసం జ‌క్క‌న సూప‌ర్ స్కెచ్‌
Mahesh Babu

Mahesh Babu New Movie Updates : RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాట‌కు ఆస్కార్ అవార్డ్ వ‌చ్చింది. దీంతో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకుంద‌న‌టంలో సందేహం లేదు. RRR ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ డైరెక్ట‌ర్ సైతం హాలీవుడ్‌లో సినిమా చేసే ఆలోచ‌న ఉంటే త‌న‌కు చెప్పాలంటూ ఓపెన్ ఆఫ‌ర్ కూడా ఇచ్చేశారు. సినిమా సినిమాకు రాజ‌మౌళి త‌న రేంజ్‌ను పెంచుకుంటూ వ‌స్తున్నారు. ఆర్ఆర్ఆర్‌తో హాలీవుడ్‌ని సైతం త‌న వైపు తిప్పుకునేలా చేశారు జ‌క్క‌న్న‌.

ఇప్పుడు రాజ‌మౌళి నెక్ట్స్ మూవీని ఎలా తెరకెక్కిస్తాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోన్న అంశం. మీరో ఎవ‌రో అంద‌రికీ తెలిసిందే.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు. అయితే ఈ సినిమాను ఇంత‌కు ముందు సినిమాల‌ను తెర‌కెక్కించిన‌ట్లు కాకుండా ఎక్కువ బాధ్య‌త‌తో తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ఇండియాలోనే కాదు.. ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా రాజ‌మౌళి సినిమా కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి రాజ‌మౌళి ప్రారంభం నుంచి ఎంతో కేర్ తీసుకుని హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌తో టై అప్ అవుతున్నార‌ట‌. ఈ ఏడాదిలో సినిమాను లాంచ‌నంగా ప్రారంభించ‌ట‌మే కాకుండా.. వ‌చ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నార‌ట మ‌హేష్‌, రాజ‌మౌళి.

తాజాగా SSMB 29 మూవీపై మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే, ఇదొక ట్ర‌యాల‌జీగా రానుంద‌ట‌. అంటే ఈ సినిమా మూడు భాగాలుగా రూపొందన్న‌మాట‌. అందుక‌నే ముందు నుంచే రాజ‌మౌళి ఈ సినిమాలో హాలీవుడ్ న‌టీన‌టుల‌ను, టెక్నీషియ‌న్స్‌ను కూడా పార్ట్ చేస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియానా జోన్స్ త‌ర‌హా యాక్ష‌న్ మూవీగా SSMB 29ను రూపొందించే ఆలోచ‌న‌లో జ‌క్క‌న్న అండ్ టీమ్ ఉన్నార‌ట మ‌రి. మినిమం బడ్జెట్టే రూ.500 కోట్లు అనుకుంటున్నారు. సినిమా చేసే క్రమంలో దీని పరిధి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫ్యూచర్‌లో ఈయనతో పాటు ఇంకెవరెవరు నిర్మాణంలో యాడ్ అవుతారో చూడాలి మరి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×