Big Stories

Samantha in Shah Rukh Khan Movie: బాలీవుడ్ కింగ్ ఖాన్ తో జోడి కట్టనున్న సమంత.. డైరెక్టర్ ఎవరంటే..?

Samantha Lead Role in Shah Rukh Khan Movie: స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ కు మకాం మార్చేస్తుందా.. ? అంటే నిజమే అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇక ఈ ఏడాది నుంచే ఆమె సినిమా కథలు వింటుంది. మధ్యలో కూడా ఖాళీ లేకుండా ఒక పక్క యాడ్స్, ఇంకోపక్క పాడ్ క్యాస్ట్ చేస్తూ బిజీగా మారింది.

- Advertisement -

ఇప్పటికే అమ్మడు నటించిన సిటాడెల్ రిలీజ్ రెడీ అవుతోంది. ఇది కాకుండా ఈ ఏడాదిలో సామ్ ఒప్పుకున్నా చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఏమి ఇంకా తెలియలేదు. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా కూడా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సామ్ బాలీవుడ్ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అది కాకుండా సమంత కోరిక కూడా నెరవేరబోతుందంట. అదేంటంటే.. సామ్ ఫేవరేట్ హీరోస్ లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఏ ఇంటర్వ్యూలో అయినా సామ్.. షారుఖ్ ఖాన్ తో నటించాలని ఉందని చెప్తూ వచ్చేది. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన ఈ చిన్నది రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది.

Also Read: Prabhas: నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ రోల్ : ప్రభాస్

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. షారుఖ్- రాజ్ కుమార్ హిరానీ కాంబోలో ఇప్పటికే డంకీ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపాయినా.. హిందీలో ఒక మోస్తరుగా ఆడింది. ఇక ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

దేశభక్తితో కూడిన యాక్షన్‌ అడ్వంచరస్‌ కథాంశంతో  తెరకెక్కనున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన హీరోయిన్ గా సామ్ ఎంపిక అయ్యిందని చెప్పుకొస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ చిన్నదాన్ని పట్టుకోవడం ఇక కష్టమే. ఇప్పటికే అమెజాన్ వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ కు దగ్గరైన ఈ బ్యూటీ షారుఖ్ తో రొమాన్స్ చేస్తే.. ఇక బాలీవుడ్ కే మకాం మార్చడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News