Big Stories

Bhanupriya: ఆ వ్యాధితో బాధపడుతున్న సీనియర్ నటి.. అందుకే సినిమాలకు స్వస్తి.. ?

Bhanupriya: అందం, అభినయం ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ, కళ్ళతోనే నటించగలిగిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరు భానుప్రియ. కళ్లు కూడా మాట్లాడగలవు ఆమెను చూస్తేనే తెలుస్తోంది. ఇక నాట్యంలో నెమలిని మించిపోతుంది. అంత అందం, అభినయం, డ్యాన్స్ తో మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యింది. వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో భానుప్రియ తెలుగు తెరకు పరిచయమైంది.

- Advertisement -

జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా .. మైనా అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. అందులో సితారగా భానుప్రియ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్నిఅందుకున్న ఆమె ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి.

- Advertisement -

ఇక ఈ సినిమాల తరువాత స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే భరత నాట్య కళాకారిణి సుమతీ కౌశల్‌ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ను ఆమె వివాహం చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ జంటకు అభినయ అనే కుమార్తె కూడా ఉంది. కొన్నేళ్లు అన్యోన్యంగానే ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తరువాత భానుప్రియ.. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ SSC, ఛత్రపతి, మహానటి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే ఈ మధ్యకాలంలో ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం భానుప్రియ మెమరీ లాస్ వ్యాధితో బాధపడుతుందట. 57 ఏళ్ల భానుప్రియకు.. ఈ మధ్య ఏది గుర్తు ఉండడం లేదట. అందుకే కుటుంబసభ్యులు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు సమాచారం. దానివల్లనే ఆమె సినిమాలకు స్వస్తి పలికిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఈ విషయం తెల్సిన అభిమానులు మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News