Big Stories

Salman Khan: సల్మాన్ హత్యకు భారీ కుట్ర..పోలీసుల చార్జిషీటులో సంచలన విషయాలు

Accused planned  to attack Salman: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు భారీ కుట్ర జరిగింది. గత ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటిపైన జరిగిన తుపాకీ కాల్పుల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే దాడి చేసినట్లు వెల్లడైంది. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ తర్వాత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

- Advertisement -

సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు ఐదుగురు నిందితులు రూ.25 లక్షల సుపారీకి ఒప్పుకున్నట్లు తెలిసింది. అనంతరం సల్మాన్ ఖాన్ కదలికలపై బిష్టోయ్ గ్యాంగ్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సల్మాన్ కదలికలను పరిశీలించిన ఈ గ్యాంగ్..సల్మాన్ కారును చుట్టిముట్టి కాల్పులు జరపాలని ప్లాన్ వేశారు. అయితే ఇందుకోసం పాకిస్తాన్ నుంచి ఏకే 47, ఏకే 92, ఎమ్ 16 రైఫిల్స్, టర్నిష్ తయారు చేసిన జిగానా పిస్ట్ కొనుగోలు చేశారు.

- Advertisement -

సల్మాన్‌ను హత్య చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి ఒక బాలుడిని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ప్రణాళికా ప్రకారం..బిష్ణోయ్ ఆదేశాల కోసం నిందితులు ఎదురు చూశారు. సల్మాన్ ఖాన్ కదలికను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా 50 మందికి పైగా రంగంలోకి దించినట్లు తెలిసింది. వీరంతా సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద, పన్వేల్ లోని ఆయన ఫామ్ హౌస్, షూటింగ్ సెట్స్ వద్ద కూడా హీరో కదలికను ఎప్పటికప్పుడూ గమనించారు.

రాజస్థాన్ కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే హత్య చేసేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సేకరించింది. ఈ ఆయుధాలను గతంలో పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యకు వినియోగించారు.

సల్మాన్‌ను హత్య చేసేందుకు బాలుడిని తీసుకొచ్చారు. వీరు బాస్‌లు ఉత్తర అమెరికాలో ఉన్నారు. అయితే వీరంతా ఒక వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి దాడి చేసేందుకు ఎదురు చూశారు. మొత్తం ఈ గ్రూపులో 15 మంది ఉన్నట్లు తేలింది. హత్యకు సంబంధించి సంభాషణ ఎప్పటికప్పుడు అందులోనే సమాచారం అందించుకుంటూ ఉన్నారు. ఇందులో అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, అజేయ్ కశ్యప్, వినోద్ భాటియా, రిజ్వాన్ హసన్, వాస్పి, మహమ్మద్ ఖాన్ ఉన్నట్లు చార్జిషీటులో రాశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News