Big Stories

Renuka Swamy Murder Case: రేణుకా స్వామి మర్డర్ కేసు.. పవిత్ర, దర్శన్ స్టేట్‌మెంట్స్ ఇవే..!

Renuka Swamy Murder Case: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రేణుకా స్వామి హత్యకేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి రోజుకో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడ‌తో దాదాపు 10 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవిత్ర గౌడ కూడా తన సోషల్ మీడియాలో రాసుకున్నారు కూడా. ఇన్నేళ్లు దర్శన్ తన ప్రియురాలితో రిలేషన్‌లో ఉంటూ తన భార్యకు దూరంగా ఉండటంతో దర్శన్ అభిమాని రేణుకా స్వామి రగిలిపోయాడు.

- Advertisement -

దీంతో సోషల్ మీడియాలో పవిత్ర గౌడ ఫొటోలకు కామెంట్లు చేసేవాడు. దర్శన్ ఫ్యామిలీలో విభేదాలు రావడానికి ప్రధాన కారణం పవిత్రగౌడే అని.. వెంటనే ఆయన్ను విడిచిపెట్టాలని ఆమె ఫొటోలకు కామెంట్లు చేసేవాడు. అంతేకాకుండా అసభ్యకరంగా కూడా కామెంట్లు చేసేవాడట. దీంతో పవిత్ర గౌడ తన ప్రియుడు దర్శన్‌కు చెప్పగా.. రేణుకా స్వామిని బెంగుళూరు పిలిపించి అక్కడ హత్య చేయించినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అయితే హత్య జరుగుతున్నప్పుడు పవిత్ర, దర్శన్ అక్కడే ఉన్నట్లు ఇప్పటికే పోలీసులకు దొరికిపోయిన నిందితులు చెప్పడంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆధారాల కోసం కూడా దర్శన్, పవిత్ర సెల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ చూడగా అదే ప్రదేశంలో చూపించడంతో కర్ఫర్మ్ చేసుకుని వారిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 మంది ఉన్నట్లు సమాచారం. అందులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: రతి నిర్వేదం సినిమా గుర్తుందా.. కుర్రాళ్లను పిచ్చెక్కించిన హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ?

ఈ కేసులో ఏ1 ముద్దాయిగా పవిత్ర గౌడ కాగా.. ఏ2 ముద్దాయిగా దర్శన్‌‌ ఉన్నాడు. వీరికి మొదటిగా 6రోజుల పోలీసు కస్టడీ విధించారు. అయితే ఇవాల్టికి అంటే జూన్ 16 ఆదివారంతో ముగియనుండగా.. ఆదివారం సెలవు కావడంతో వారిని ఒకరోజు ముందుగానే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి మరో 5 రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పవిత్ర గౌడ, దర్శన్, పవన్, రాఘవేంద్ర, నందీష్‌లు పోలీసుల ఎదుట వారి వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక్కొక్కరి వాగ్మూలం ఎలా ఉందంటే..

పవిత్ర గౌడ: రేణుకా స్వామి అసభ్యకర సన్నివేశాలు పంపించాడు. అవి నా ఇంట్లో ఉన్న పనిమనిషి పవన్‌కి పంపించాను. అయితే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్‌కు తెలియకూడదని పవన్‌కి చెప్పాను. అసభ్యకర కామెంట్లు పంపడంతో రేణుకా స్వామికి బుద్ది చెప్పాలనుకున్నా .. అంతేకాని అతడిని హత్య చేయాలన్న ఆలోచనే నాకు లేదు అని పోలీసుల ముందు వాగ్మూళం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దర్శన్: పవన్‌ ద్వారా ఈ అసభ్యకర కామెంట్ల విషయం నా వరకు వచ్చింది. అయితే అప్పుడే నేను చిత్రదుర్గ అభిమాన సంఘం నాయకుడు రాఘవేంద్రకు చెప్పి రేణుకా స్వామిని తీసుకురావాలని తెలిపాను. అతడ్ని తీసుకొచ్చిన తర్వాత వార్నింగ్ ఇచ్చాను. మరోసారి అసభ్యకరమైన కామెంట్లు పంపితే సరికాదని హెచ్చరించాను. అలా చెప్పిన తర్వాత కొంత డబ్బులిచ్చి భోజనం చేసి ఊరు వెళ్లిపోమని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను అతడ్ని హత్య చేయలేదు. నాకు ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

Also Read: అనుకున్నదే అయ్యింది.. బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ.. ?

పని మని పవన్: రేణుకా స్వామి నుంచి అసభ్యకర మెసేజ్‌లు వస్తుండటంతో అతను ఎవరో కనుక్కో అని పవిత్రక్క చెప్పింది. దీంతో నేను పవిత్ర గౌడ పేరుతో రేణుక స్వామితో చాటింగ్ చేసి అతడి ఫోన్ నెంబర్ కనుక్కున్నాను. ఆ తర్వాత ఈ విషయాన్ని దర్శన్‌కి చెప్పాను. ఆ తర్వాత రేణుకా స్వామిని బెంగళూరు తీసుకెళ్లి అతనిపై దాడి చేశారు. దీంతో రేణుకా స్వామి కిందపడిపోవడంతో.. సృహతప్పి పడిపోయాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత రేణుకా స్వామి చనిపోయాడు. అతడ్ని భయపెట్టాలి అనుకున్నారు తప్ప చంపాలని ఎలాంటి ఉద్దేశ్యం లేదని పవన్ తన వాగ్మూళం ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News