Big Stories

Renu Desai: నేనేం వదిలేయలేదు మీ దేవుడిని.. టార్చర్ చేయోద్దు.. మరోసారి బాంబ్ పేల్చిన రేణు

Renu Desai: రేణు దేశాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అన్ని బావుండి ఉంటే.. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి భార్యగా వెలుగొందేది. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మారింది. పవన్ కళ్యాణ్- రేణు లవ్ స్టోరీ, విడాకులు, పిల్లలు.. వీటి గురించి అందరికి తెలుసు. భర్తను వదిలేసినా.. ఆమె ఎప్పుడు పిల్లలను తండ్రికి దగ్గరగానే ఉంచుతుంది.

- Advertisement -

అకీరా, ఆద్య ఎప్పుడు కొణిదెల వారసులుగానే పెరుగుతున్నారు. ఆ విషయంలో రేణు ఎలాంటి పరిస్థితిలో అడ్డు చెప్పదు. ఎలాంటి కారణాల వలన వారు విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటున్నారు. అయితే.. పవన్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు రేణును ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మాజీ భార్యగా ఉన్నా కూడా ఫ్యాన్స్ ఇంకా వదినమ్మ అనే పిలవడం విశేషం. ఆ పిలుపు వద్దు అని ఆమె ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయింది.

- Advertisement -

కొన్నిసార్లు.. కొంతమంది అభిమానులు చేసే కామెంట్స్ కు రేణు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా పవన్ డిప్యూటీ సీఎం గా మారారు. ఇప్పుడు కూడా రేణుకు ఇలాంటి కామెంట్స్ తప్పడం లేదు. తాజాగా రేణు..చీరకట్టులో పూజ చేస్తున్న వీడియోను ఒకటి షేర్ చేసింది. ఇక ఈ వీడియోపై పవన్ ఫ్యాన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.

“వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది.. ఒక దేవుడ్ని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు.. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది.. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది.. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన.. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన” అని కామెంట్ చేయగా.. దానిపై రేణు ఘాటుగా స్పందించింది.

” మీకు కొంచెమైనా బుద్ది ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు.. నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కొంతమంది ఆమె బతుకు ఆమె బతుకుతుంది. వదిలేయండి.. పవన్ వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారి ఫ్యామిలీ గురించి ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News