Big Stories

Shwetha Menon: రతి నిర్వేదం సినిమా గుర్తుందా.. కుర్రాళ్లను పిచ్చెక్కించిన హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ?

Shwetha Menon: మలయాళ ముద్దుగుమ్మలు అంటే తెలుగువారికి భలే మక్కువ ఎక్కువ. మొదటి నుంచి కూడా మలయాళీ ముద్దుగుమ్మలు తెలుగువారినే ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు.. జీరో సైజు కాకుండా ప్లస్ సైజు లో ఉండే వారి అందం వర్ణించడం కష్టమే. ఇప్పుడంటే మలయాళీ ముద్దుగుమ్మలు కూడా బక్కచిక్కి కనిపిస్తున్నారు. కానీ, ఒకప్పుడు హీరోయిన్లు కొంచెం బొద్దుగానే ఉండేవారు. అప్పటి మలయాళీ హీరోయిన్స్ లో ఒకరే శ్వేతా మీనన్.

- Advertisement -

అరే.. ఎవరీమె .. మాకు తెలియదే అనుకుంటున్నారా.. ? 2011 లో రిలీజ్ అయినా రతి నిర్వేదం సినిమా గుర్తుందా.. ? థియేటర్ లో చూడకపోయినా.. యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించిన సినిమాల్లో రతి నిర్వేదం ఒకటి. రొమాంటిక్ మూవీస్ లిస్ట్ తీస్తే టాప్ 10 లో ఈ సినిమ కచ్చితంగా ఉంటుంది. ఇక ఈ చిత్రంలో రతిగా నటించింది శ్వేతా మీనన్. తనకన్నా వయస్సులో చిన్నవాడిపై మనసు పారేసుకుని, అతడిని పెళ్లి చేసుకోలేక.. వేరేవాడిని పెళ్లి చేసుకోలేక సతమమతమయ్యే పాత్రలో శ్వేతా నటన ఒక ఎత్తు అయితే.. ఆమె అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్స్ మరోఎత్తు. ఈ సినిమా తరువాత తెలుగువారు శ్వేతా మీనన్ గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు.

- Advertisement -

1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచిన ఈ చిన్నది ఆ తరువాత భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించింది. తెలుగులో ఆనందం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. సినిమాలే కాకుండా యాంకర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, సీరియల్ నటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో శ్వేతా మీనన్ నటించి మెప్పించింది. ఇప్పటికీ ఆమె నటిస్తూనే ఉంది. అయితే తెలుగులో మాత్రం ఇప్పటివరకు సరైన పాత్రలో కనిపించింది లేదు.

ఇక శ్వేతా కెరీర్ లో రతి నిర్వేదంతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బావుందని చెప్పుకొస్తున్నారు. మరి శ్వేతా మీనన్ ముందు ముందు ఏమైనా తెలుగులో కనిపిస్తుందేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News