BigTV English

RRR : ఆ ఖర్చులపై లెక్కలున్నాయా..? తమ్మారెడ్డికి దర్శకేంద్రుడు కౌంటర్..

RRR : ఆ ఖర్చులపై లెక్కలున్నాయా..? తమ్మారెడ్డికి దర్శకేంద్రుడు కౌంటర్..

RRR : ఆయన నిత్యం వివాదాల్లో ఉంటారు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ లో ఏ ఇష్యూ జరిగినా ఆ దర్శక, నిర్మాత ఎంటరైపోతారు. తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా కుండబద్దలుకొట్టి చెప్పేస్తారు. సినీలెంజడ్స్, స్టార్ హీరోలు, ఉద్దండ దర్శక , నిర్మాతలపైనా విమర్శనాస్త్రాలు సంధించడానికి వెనుకాడరు. ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ . ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి మరొకరు. ఎవరిపైనా ఎలాంటి విమర్శలు చేయని నైజం ఆయనది. తన సినిమాలపై ఎన్ని వివాదాలు చుట్టిముట్టినా మౌనవ్రతమే పాటించే సహనశీలి . ఆయనే కె. రాఘవేంద్రరావు. అలాంటి దర్శకేంద్రుడు ఇప్పుడు తమ్మారెడ్డిపై ఫైర్ అయ్యారు. అసలు వివాదం ఏంటి? రాఘవేంద్రుడికి అంత కోపం ఎందుకొచ్చింది?.. విషయంలోని వెళితే..


తాజాగా RRR టీమ్ పై తమ్మారెడ్డి భరద్వాజ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. RRR బడ్జెట్ పై సెటైర్లు వేశారు. ఆ సినిమాను రూ. 600 కోట్లు ఖర్చు చేసి నిర్మించారని అన్నారు. అక్కడితో ఆగితే వివాదం ఉండేదికాదు. కానీ ఆస్కార్ ప్రమోషన్ కోసం RRR టీమ్ రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఆ ఖర్చుతో 8 సినిమాలు తీయవచ్చని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. సినిమా ఫ్యాన్స్ తోపాటు కొందరు సినీ ప్రముఖులు తమ్మారెడ్డిపై మండిపడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి తీరును తప్పుపట్టారు.

తమ్మారెడ్డి భరద్వాజపై తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రపంచవేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలన్నారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్స్‌ చేస్తారని ప్రశ్నించారు. రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర లెక్కలున్నాయా? అని నిలదీశారు. జేమ్స్‌ కామెరూన్‌, స్పీల్‌బర్గ్‌ లాంటి దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా? అంటూ తమ్మారెడ్డిపై దర్శకేంద్రుడు ప్రశ్నల వర్షం కురిపించారు.


Rajamouli : ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి.. ఎక్కడంటే..?

Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×