E-Paper
Advertisement

Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Rishab Shetty:రీసెంట్‌గా పాన్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఓ స్టార్ హీరో త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇంత‌కీ స్టార్ ఎవ‌రో కాదు.. రిష‌బ్ శెట్టి. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు ఎప్ప‌టికీ అవినావ‌భావ సంబంధం ఉంటూనే ఉంటుంది. అదే దారిలోనే రిష‌బ్ పాలిటిక్స్‌లోకి అడుగు పెడుతున్నారు. అస‌లు ఈ వార్త పుట్టటానికి కార‌ణం రిష‌బ్ శెట్టినే. ఎందుకంటే రీసెంట్‌గా ఆయ‌న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మైను క‌లిశారు. వారిద్ద‌రూ కాసేపు ప్రైవేట్‌గా మాట్లాడుకున్నారు.

ఈ విష‌యం జ‌రగ‌టానికి కొన్ని రోజుల ముందే ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల‌ను రిష‌బ్ క‌లిశారు. ఇప్పుడు బ‌స‌వ‌రాజ్ బొమ్మైను క‌లవ‌టంతో రిష‌బ్ శెట్టి బీజేపీ పార్టీలోకి చేర‌బోతున్నార‌ని అందుక‌నే ముఖ్య‌మంత్రిని క‌లిశారనే వార్త‌లు జ‌న‌రేట్ అయ్యాయి. కానీ అలాంటిదేమీ లేద‌ని, తాను కాంతార షూటింగ్ స‌మ‌యంలో అక్క‌డున్న స్థానిక ప్ర‌జ‌లు కొన్ని స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, వాటిని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకు రావ‌టానికే ఆయ‌న్ని క‌లిశాన‌ని చెప్పారు రిష‌బ్ శెట్టి.

గ‌త ఏడాది హీరోగా న‌టిస్తూ రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కాంతార‌. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఇప్పుడు రిష‌బ్‌.. కాంతార‌కు ప్రీక్వెల్‌ను కాంతార 2గా రూపొందించ‌బోతున్నారు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Anushka Shetty: హాట్ లుక్‌లో అనుష్క‌… రూమ‌ర్స్‌కి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం

Samantha: హమ్మయ్య సమంత ఎంట్రీ ఇచ్చేసింది.. రౌడీ స్టార్ ‘ఖుషి’

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×