Big Stories

Kalki 2898 AD Collections: శరవేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

Kalki 2898 AD box office collection(Latest news in tollywood): ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. యమ స్పీడులో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియుల్ని సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. హాలీవుడ్ మాదిరి సినిమాలా విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో అభిమానులు ఫిదా అయిపోయారు. సైన్స్ ఫిక్స‌న్‌కు ముడిపెడుతూ తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

- Advertisement -

అంతేకాకుండా మిగతా స్టార్స్ కూడా ఇందులో చిన్న చిన్న నిడివి గల పాత్రలో కనిపించి కనువిందు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి ఫరియా అబ్దుల్లా, దర్శకుడు అనుదీప్, వంటి నటీ నటులు ఇందులో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. కాగా దర్శకుడు నాగ్ అశ్విన్‌లో ఇలాంటి ఒక ఆలోచన ఉందని ఎవ్వరూ ఊహించలేరు. నిజంగా ఒక టాలీవుడ్ దర్శకుడు కల్కి వంటి సినిమాని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తాడని ఎవ్వరూ అనుకోరు.

- Advertisement -

అలా ఎవరి ఊహలకు అందని సినిమాను తీసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ప్రభాస్‌ను చూపించే విధానం అందరినీ ఆకట్టుకుంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించి సినిమాకు మరింత వన్నె తెచ్చారు.

Also Read: ప్రభాస్ ‘క‌ల్కి’ నుంచి ‘టా టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

అలా అందరి సహకారంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లను నమోదు చేసిన ఈ సినిమా రెండ్రోజుల్లో రూ.298.5 కోట్ల కలెక్షన్లు అందుకుంది. అయితే రెండో రోజు మాత్రం వసూళ్లు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఇక మూడు రోజుల్లో మరింత పుంజుకుంది. ఏకంగా రూ.415 కోట్లు వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి.

దీంతో మొత్తంగా వారంతానికి కల్కి సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇక తాజాగా ఈ సినిమా రూ.500 క్లబ్‌లో చేరిపోయినట్లు నిర్మాణ సంస్థ వైజయింతీ మూవీస్ బ్యానర్ ప్రకటించింది. దీంతో సినీ ప్రియులు, ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News