Big Stories

Kalki 2898 AD First Day Collections: బాక్సాఫీసు రారాజు.. ప్రభాస్ రాజు.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

Kalki 2898 AD First Day Collections(Latest movies in tollywood): ఎన్నడూ సూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి.. నేను ఎవర్ని అనే బాహుబలి డైలాగ్.. కల్కి 2898 ఏడీ చిత్రానికి కూడా బాగా సెట్ అవుద్ది. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ ప్రియులు, అభిమానుల్లో ఒకటే ఆసక్తి, ఒకటే ఉత్కంఠ. ఈ చిత్రం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కేవలం ప్రభాస్ అభిమానులే అంటే పొరబడినట్లే యావత్ ప్రపంచ సినీ ప్రియులు మొత్తం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు.

- Advertisement -

ఇక జూన్ 27న వారి వెయిటింగ్‌కు తెర పడింది. ప్రపంచ వ్యాప్తంగా ‘kalki 2898ad’ మూవీ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. రిలీజ్ రోజు థియేటర్ల వద్ద హంగామా చూస్తే వాసి వాడి తస్సాదియ్యా అనిపించింది. ఇక ఫస్ట్ షో నుంచే కల్ట్ బ్లాక్ బస్టర్ టాక్‌ను కల్కి మూవీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కంటెంట్ అయినా.. విజువల్స్ అయినా.. వీఎఫ్ఎక్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేనా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌కు సెల్యూట్ చేశారు. ఈ మేరకు దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

Also Read: కల్కి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎందులో చూడొచ్చు అంటే.. ?

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సినీ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇందులో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు నటించడంతో సినిమా రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని పురాణాలకు, కలియుగానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి సృష్టించిన అద్భుతమైన ప్రపంచం ఈ సినిమా. వీటికి తోడు హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌కి ఫిదా అవ్వనివారుండరు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా దర్శకుడు తెరకెక్కించాడు.

అయితే ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌తో అదరగొట్టిన ఈ సినిమా కలెక్షన్లలో కూడా దుమ్ము దులిపేసింది. ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లలో భారతీయ సినిమాల్లో 3వ అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసి అదరగొట్టింది. ఈ సినిమా భారతదేశంలో రూ.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే గ్రాస్ కలెక్షన్ల ప్రకారం.. ఈ సినిమా రూ.118 కోట్లు వసూళు చేసినట్లు సమాచారం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.191.5 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో మొదటి రోజు ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా కల్కి మూవీ నిలిచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News