Big Stories

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి 2898AD సినిమా రివ్యూ.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికేసినట్టే..!

Prabhas Kalki2898AD Movie Review: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. అని ప్రభాస్ ఫ్యాన్స్ సాంగ్ వేసుకుంటూ థియేటర్ కు బయల్దేరారు. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898 AD ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తరువాత ప్రభాస్ కు అంతటి విజయం అందింది లేదు. మధ్యలో కొన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా అవి మిక్స్డ్ టాక్ ను అందుకోవడంతో ప్రభాస్ కు భారీ హిట్ అందింది అని చెప్పలేకపోయారు.

- Advertisement -

ఇక సలార్ తరువాత డార్లింగ్ నటించిన కల్కి మీదనే అభిమానులకు ఎన్నో అంచనాలను పెట్టుకున్న విషయం తెల్సిందే. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ నాగీ.. ట్రైలర్ తో సినిమాపై హైప్ ను ఒక్కసారిగా పెంచేశాడు. సైన్స్ ఫిక్షన్ కథకు మహాభారతాన్ని జోడించి కొత్త కథను ప్రేక్షకుల ముందు ఉంచాడు. మరి ఆ కల్కి కథ ఏంటి.. ? అసలు కల్కి ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.

- Advertisement -
కథ

చిన్నతనం నుంచి అశ్వత్థామ హతః కుంజరః అని చదువుకుంటూనే వస్తున్నాం. ఈ సినిమా కూడా ఇదే డైలాగ్ తో మొదలయ్యింది. అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్).. కురుక్షేత్ర యుద్ధంలో నా అనుకున్నవారందరినీ పోగొట్టుకుంటాడు. తాను ప్రాణంగా ప్రేమించిన తండ్రిని కూడా కోల్పోవడంతో అతనికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. తన వంశాన్ని నాశనం చేసిన పాండవులకు కూడా వంశం లేకుండా చేయాలని.. గర్భంతో ఉన్న అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) పై కడుపులో బ్రహ్మాస్త్రను సంధిస్తాడు. దీంతో ఆ శిశువు మరణిస్తాడు. ఇక ఇది తెలుసుకున్న కృష్ణుడు.. అశ్వద్ధామకు శాపం విధిస్తాడు. నీకు ఎప్పటికీ చావు రాదు. నువ్వెంత క్రుంగి కృశించినా, నీ శరీరం కుళ్లిపోయినా కూడా నీకు చావు రాదు అని శపించగానే.. అశ్వద్ధామ శాప విమోచనము వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు కలియుగంలో పాపాలు ఎక్కువ అయ్యినప్పుడు మళ్లీ నేను పుడతాను. అప్పుడు కూడా కల్కి నన్ను చంపడానికి చూస్తాడు. ఆ సమయంలో ఆ తల్లి కడుపులో ఉన్న నన్ను నువ్వే కాపాడాలి.. అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.

Also Read: Prabhas – Kalki 2898 AD: RRRతో సహా.. మరో రేర్ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్‌.. దీన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరు

అలా 6 వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రపంచం మొత్తం పాపాలతో నిండిపోతుంది. ముఖ్యంగా కాశీ పట్టణం మొత్తం తిండి లేక, నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటుంది. 2898 AD లో ప్రజలు దిక్కులేనివారుగా తయారవుతారు. ఇక వారిని తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు సుప్రీం యాస్మిన్. కాంప్లెక్స్ అనే కొత్త నగరాన్ని సృష్టించి మకుటం లేని మహారాజుగా ఏలుతూ ఉంటాడు. ఇంకోపక్క యాస్మిన్ కు వ్యతిరేకంగా శంభల అనే నగరంలో కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఎప్పటికైనా యాస్మిన్ ను మట్టుబెట్టే దేవుడు వస్తాడు అని, ఆ దేవుడు ను కనే తల్లి ఇక్కడకు వస్తుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. యాస్మిన్.. కాంప్లెక్స్ లో ప్రాజెక్ట్ కె పేరుతో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్న ఆడవారి గర్భంలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఇంజెక్ట్ చేసిన అమ్మాయిలు 100 రోజులు కూడా దాన్ని మోయలేకపోతారు. కానీ, సుమతి (దీపికా పదుకొనే) మాత్రం 150 రోజులు దాన్ని మోస్తుంది. ఇది తెల్సిన యాస్మిన్ మనుషులు ఆమెను పట్టుకోవాలని చూస్తుండగా.. సుమతి కాంప్లెక్స్ నుంచి పారిపోయి శంభలలో దాక్కుంటుంది.

సుమతిని వెతికి పట్టుకున్నవారికి ఊహించనంత యూనిట్స్ (డబ్బు) ఇస్తామని ఆశ చూపుతారు. ఇక ఆ విషయం తెలుసుకున్న భైరవ (ప్రభాస్) ఆమె కోసం శంభల వెళ్తాడు. సుమతి కడుపున పుట్టబోయే బిడ్డనే భగవంతుడు అని తెలుసుకున్నా అశ్వద్ధామ.. ఆమెకు రక్షగా నిలబడతాడు. మరి చివరికి ఎవరు గెలిచారు.. ? భైరవ ఎవరు.. ? అశ్వద్ధామతో యుద్ధం చేసే శక్తి అతడికి ఎలా వచ్చింది..? సుమతి కడుపులో బిడ్డను యాస్మిన్ ఎందుకు చంపాలనుకుంటాడు.. ? అశ్వద్ధామ శాప విమోచనం జరిగిందా.. ? అనేది తెలియాలంటే కల్కి 2898 AD సినిమాను తెరపై చూడాల్సిందే.

Also Read: Kalki 2898 AD First Day Collections: బాక్సాఫీసు రారాజు.. ప్రభాస్ రాజు.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

విశ్లేషణ

మహానటి తరువాత నాగ్ అశ్విన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. ఇక ప్రాజెక్ట్ కె అంటూ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేయడంతో ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ నే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు అనుకున్నారు కానీ ఇలాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తాడు అని అనుకోలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఫ్రేమ్ చూడడానికి కళ్లు సరిపోయేలా లేవు అంటే అతిశయోక్తి కాదు. మహాభారతాన్ని, అందులోని క్యారెక్టర్స్ ను తీసుకొని.. దానికి సైన్స్ ఫిక్షన్ జోడించి.. ఒక కొత్త ఊహతో నాగి సృష్టించిన ఈ సినిమా ఒక చరిత్ర అని చెప్పాలి. దీని సృష్టించిన అతనికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. హాలీవుడ్ సినిమాల్లో కొత్త నగరాలు ఎలా ఉంటాయో.. ఇందులో మూడు నగరాలను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

కాశీ, శంభల, కాంప్లెక్స్ నగరాలు ఎప్పటికీ మన కళ్లలో అలా మెదులుతూ ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఈ మూడు నగరాలను చూపించడం, అందులో ప్రజలను పరిచయం చేయడం, వారు పడే కష్టాలను చూపించడంతోనే సరిపోయింది. కొద్దిగా స్లో గా సాగినా కూడా సినిమాలోకి వెళ్లేకొద్దీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.ఇక ఇంటర్వెల్ నుంచి సినిమా మొదలవుతుంది. భైరవ.. బుజ్జిని తయారుచేసి .. కాంప్లెక్ వెళ్ళడానికి పడే కష్టం నుంచి అతను శంభల వెళ్లి అశ్వద్ధామతో తలపడే సీన్ తో విరామం ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం .. ప్రేక్షకులను చూపు కూడా తిప్పనివ్వకుండా చేశారు. సెకండ్ హాఫ్ లో పోరాటాలు, యుద్ధాలతో నింపేశాడు.

Also Read: Chiranjeevi: కల్కి హిట్.. అభినందనలు తెలిపిన మెగాస్టార్

భైరవ- అశ్వద్ధామ మధ్య యుద్ధ సన్నివేశాలు అయితే అలా నోరు వెళ్ళబెట్టి చూడడమే. చావే లేని చిరంజీవి అయిన అశ్వద్ధామ.. కాలానికి అనుగుణంగా వెపన్స్ తీసుకొని పోరాటం చేయడం భలే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఒక్కో విజువల్ ఒక్కో డైమెండ్ అని చెప్పాలి. అశ్వినీదత్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించినట్లు ఆ నగరాలూ చూస్తేనే తెలిసిపోతుంది. ఇక క్లైమాక్స్ చివరి 15 నిమిషాలు సినిమాకు బలం. న భూతో న భవిష్యత్ అనే లెవెల్ లో ఉంటుంది. ఆ విజువల్స్, యుద్దాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఇలాంటి సినిమాలకు రాజమౌళి మాత్రమే బెస్ట్ అనుకునేవారికి.. ఈ సినిమా చూసాక.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి వచ్చాడని అనిపించకమానదు.

నటీనటులు

సినిమా మొత్తం స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. భైరవగా ప్రభాస్.. తక్కువ సమయం మాత్రమే కనిపించాడు అనేది ఈ సినిమాలో మైనస్ పాయింట్. సినిమా మొత్తం అమితాబ్ చుట్టూనే నడుస్తుంది. ఆయన ఫ్లాష్ బ్యాక్ నుంచి .. చివరి క్లైమాక్స్ వరకు అంతా ఆయన కథనే కనిపిస్తుంది. అశ్వద్ధామగా అమితాబ్ నటన అద్భుతం. ఆయన కెరీర్ లో చేసిన బెస్ట్ రోల్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక దీపికా.. సుమతి పాత్రకు ప్రాణం పెట్టింది. మిగతా అన్ని పాత్రలు తమ పరిధిమేరకు నటించారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. గెస్ట్ రోల్స్ లో కనిపించిన స్టార్స్ అందరూ ఒక ఎత్తు. ప్రతి 10 నిమిషాలకు ఒక్కో స్టార్ ఎంట్రీ ఉంటుంది. సడెన్ గా వచ్చిన ఆ స్టార్ ఎవరు అని గుర్తుపట్టేలోపే క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. అది కూడా ప్రేక్షకులకు ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవీ, ఫరియా, అనుదీప్ ఇలా వీరందరినీ ఊహించని పాత్రల్లో చూపించి షాక్ ఇచ్చాడు నాగీ. ఇక మొదటి నుంచి కల్కి రెండు పార్ట్స్ గా వస్తుంది అని అందరికి తెల్సిందే. దాన్ని కూడా రివీల్ చేస్తూ.. సెకండ్ పార్ట్ మరింత ఉత్కంఠభరితంగా ఉండనుందని హింట్ ఇచ్చేశాడు. అసలు కల్కి ఎవరు అనేది చివర్లో చూపించి మెంటల్ ఎక్కించాడు. బాహుబలి తరువాత డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బిర్యానీ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. ప్రేక్షకులు ప్రభాస్ ను ఎలా చూడాలనుకున్నారో నాగ్ అశ్విన్ అలా చూపించాడు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్.. థియేటర్ లో గూస్ బంప్స్ ను తెప్పించింది. నాలుగేళ్లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన నాగ్ అశ్విన్ కు మంచి ప్రతిఫలం దక్కింది.

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్: విజువల్ వండర్ కల్కి.. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News