Big Stories

Prabhas – Kalki 2898 AD: RRRతో సహా.. మరో రేర్ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్‌.. దీన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరు

Prabhas – Kalki 2898 AD Breaks RRR Record: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడీ పేరు ఒక్క ఇండియాలోనే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా గట్టిగానే వినిపిస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత కూడా అదే రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకుంది ఈ చిత్రం. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్‌ని మూవీ టీం బాగా యూజ్ చేసుకుంది.

- Advertisement -

అలా వరుస అప్డేట్‌లను వదులుతూ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఎట్టకేలకు జూన్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను కల్కి మూవీ సొంతం చేసుకుంది. సినిమాలో ప్రభాస్ వేరియేషన్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇలాంటి లుక్‌లో ప్రభాస్‌ను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

అంతేకాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడని.. ఒక హాలీవుడ్ మూవీని తలపించేలా తెరకెక్కించాడని అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎవరూ ఊహించని వసూళ్లను కల్కి నమోదు చేస్తోంది. అదీగాక బడా బడా సినిమాల రికార్డులను సైతం కొల్లగొట్టింది.

Also Read: బాక్సాఫీసు రారాజు.. ప్రభాస్ రాజు.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

కల్కి 2898 ఏడీ సినిమా మొదటి రోజే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ తొలి రోజు నైజాంలో రూ.23.55 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు కల్కి మూవీ ఆ కలెక్షన్లను బీట్ చేసింది. ఏకంగా నైజాంలో ఫస్ట్ డే రూ.24 కోట్ల కలెక్షన్లను సాధించి ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఈ రికార్డుపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీంతోపాటు అటు నార్త్ అమెరికన్ ప్రీమియర్స్‌లో కూడా కల్కి మూవీ.. ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను బీట్ చేసింది.

అయితే ఈ రికార్డుతో పాటు ప్రభాస్ మరో రికార్డును సాధించాడు. ఇండియా సినీ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సాధించని రికార్డును ప్రభాస్ క్రియేట్ చేశాడు. ఏకంగా 5 సినిమాలతో ఓపెనింగ్ రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అందులో బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో ప్రభాస్ తొలి రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టాడు.

బాహుబలి 2 తొలి రోజు రూ.217 కోట్ల కలెక్షన్స్
సాహో తొలి రోజు రూ.130 కోట్ల కలెక్షన్స్
ఆదిపురుష్ తొలి రోజు రూ.140 కోట్ల కలెక్షన్స్
సలార్ తొలి రోజు రూ.178 కోట్ల కలెక్షన్స్
కల్కి 2898 ఏడీ తొలిరోజు రూ.180 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే సినీ ఇండస్ట్రీలో రేర్ రికార్డు చేసిన హీరో ప్రభాస్ అవుతాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News