Big Stories

Kalki 2898 ad : ఏంది మచ్చా.. ‘క‌ల్కి’లో రెమ్యున‌రేష‌న్ల‌కే అంత ఖ‌ర్చు అయిందా.. ప్రభాస్ అంత తీసుకున్నాడా..?

Kalki 2898 ad : ప్రస్తుతం అందిరికళ్లు ‘కల్కి 2898 ఏడీ’ మూవీపైనే ఉన్నాయి. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అదీగాక ఇప్పటికే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా రోజుకో అప్డేట్‌తో వచ్చి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

- Advertisement -

ఇందులో భారీ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందువల్ల కల్కి సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతోపాటు ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినీ ప్రియుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. విజువల్ వండర్‌గా ఉంటూ హాలీవుడ్ మూవీలను తలపించేలా చూపించిన గ్రాఫిక్స్, యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

- Advertisement -

ముఖ్యంగా ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నచూ చూడని లుక్‌లో ప్రభాస్‌ను చూసి సినీ అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్రభాస్ అన్నాన మజాకా అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మూవీ తెరకెక్కించడానికి అయ్యే ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

Also Read: ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే ?

ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ఏకంగా రూ.700 ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ బడ్జెట్ తెలిసి సినీ ఫ్యాన్స్ ఎంత షాక్ అవుతున్నారో.. ఇందులో నటించిన స్టార్ కాస్టింగ్ రెమ్యూనరేషన్ తెలిసి కూడా అంతకంటే ఎక్కువ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీలో నటించిన స్టార్ల పారితోషికం నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయానికొస్తే..

ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ రూ.20 కోట్లు, కమల్ హాసన్ రూ.20 కోట్లు, దీపికా రూ.20 కోట్లు మేర అందుకున్నట్లు సమాచారం. దీశా పటానీ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫుల్ టాక్ నడుస్తోంది. అలాగే మిగతా నటులు మరింత తక్కువ మొత్తంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నటీ నటుల రెమ్యూనరేషన్‌కే మొత్తం రూ.250 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News