Big Stories

Payal Ghosh: 9 ఏళ్లుగా శృంగారం చేయలేదు.. అతని వలనే.. ఎన్టీఆర్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Payal Ghosh:బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి చిత్రంలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఈ చిత్రం కూడా ఆమెకు విజయాన్ని అందించలేదు. దీంతో ఈ చిన్నది .. తెలుగులో వేస్ట్ అనుకోని బాలీవుడ్ లోనే పాగా వేసింది. అక్కడ కూడా అవకాశాలు రాక.. మీటూ ఉద్యమానికి ఊపిరి పోసింది.

- Advertisement -

డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందు డైరెక్ట్ గా పేరు చెప్పి బాలీవుడ్ ను షేక్ చేసింది. టాలీవుడ్ లో తాను పనిచేసినా ఎక్కడ ఇలాంటివి కనిపించలేదని, అనురాగ్ తో మూడో మీటింగ్ లోనే అతను తనను అసభ్యంగా తాకినట్లు తెలిపి షాక్ ఇచ్చింది ఇక ఇక్కడితో ఆగలేదు. ఎక్కడ వివాదం ఉంటే అమ్మడు అక్కడే ఉంటుంది. గతేడాది.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు.. అతని ఫ్రెండ్ గౌతమ్ గంభీర్ తనకు మిస్డ్ కాల్స్ చేసినట్లు చెప్పి మరింత హీట్ పెంచింది.

- Advertisement -

ఐదేళ్ల రిలేషన్ ను మర్చిపోయి ఇర్ఫాన్ వేరే అమ్మాయిని పెళ్లాడినట్లు ఎమోషనల్ అయ్యింది. ఆ బ్రేకప్ నుంచి తాను బయటపడడం లేదని తెలిపింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ చిన్నది తన బ్రేకప్ ను గుర్తుచేసుకుంది. ఇర్ఫాన్.. మతం అడ్డుచెప్పి తనకు బ్రేకప్ చెప్పాడని, ఆ సమయంలో తాను ఎంత ఫీల్ అయ్యింది అనేది ఎవరికి అర్ధం కాదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బ్రేకప్ అయ్యాక ఇప్పటివరకు తాను మరొకరితో శృంగారంలో పాల్గొనలేదని, అది ప్రేమ అని రాసుకొచ్చింది.

” ఇర్ఫాన్ కన్నా నాకు చాలా బెటర్ ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ ఉంటే ఏంటి.. ?కానీ, ప్రేమ ప్రేమే కదా.. నా తండ్రికి మా రిలేషన్ ఇష్టం లేకపోయినా.. ఇర్ఫాన్ ను నేనెప్పుడు చీట్ చేయాలనుకోలేదు. నా తండ్రికి ముస్లిమ్స్ అంటే ఇష్టం లేదు. కానీ, నేను ఎప్పుడు ఇర్ఫాన్ కు సపోర్ట్ గా ఉంటూ వచ్చాను.. కానీ, చివరకు నాకు ఏం మిగిలింది. 2016 లో నేను, ఇర్ఫాన్ ఇంట్లో వాళ్ళను కలిశాను. ఇంటి నుంచి వచ్చి రాగానే ఇర్ఫాన్ కాల్ చేసి.. మా ఫ్యామిలీ పెళ్ళికి ఒప్పుకోలేదు అని చెప్పి.. నన్ను దూరం పెట్టాడు.

కొన్నిరోజుల తరువాత వాళ్ళ చెల్లి నాకు కాల్ చేసి ఇర్ఫాన్ కు పెళ్లి కుదిరింది అని చెప్పింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది. మీరే ఆలోచించండి.. ? నా బాధ ఎవరు అర్ధం చేసుకోలేరు. ఆ ఘటన జరిగి ఇప్పటికి 9 ఏళ్లు అవుతుంది.. ఇప్పటివరకు నేను మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనలేదు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు.. కానీ, ఇదే నిజం. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తి శృంగారం చేయడానికి ట్రై చేశాడు. కానీ దాని పట్ల ఒక గౌరవం ఉంది. ఎవరితో పడితే వాళ్లతో శృంగారంలో పాల్గొనలేం” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్ట్ చూసిన వారు.. ఇర్ఫాన్ కు పెళ్లి అయ్యింది .. ఇక వదిలేయ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News