opportunity for proposals on valentines day :- ఒకరిని ఒకరు ప్రేమించడం.. కలిసి జీవితం మొత్తం ఎలా ఉంటుందో కలలు కనడం.. భవిష్యత్తులో ప్రతీరోజు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవడం.. ఇలాంటివన్నీ చూడడానికి, వినడానికి చాలా బాగుంటాయి కదా..! మరి తను ప్రేమించిన వ్యక్తి నుండి తిరిగి పొందలేని వన్ సైడ్ లవర్స్ పరిస్థితి ఏంటి..? అలాంటి ప్రేమ కూడా అద్భుతంగానే ఉంటుందని వన్ సైడ్ లవర్స్ అంటున్నారు.
ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తుల్లో ఒకరిపై ఒకరికి ఒకేసారి కలగాలి అని లేదు. ముందుగా ఒకరిలో కలిగిన ప్రేమను అవతల వ్యక్తికి ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత.. దానిని ఓకే చేయాలా లేదా అన్న నిర్ణయం ఆ వ్యక్తి చేతిలో ఉంటుంది. కొన్నిరోజులకు అవతల వ్యక్తికి కూడా ఆ ఫీలింగ్ కలగవచ్చు.. లేదా ఎప్పటికీ కలగకపోవచ్చు. అలాంటప్పుడే ముందుగా ప్రేమ కలిగిన వ్యక్తి మనసు అయోమయంలో పడుతుంది. ప్రేమను రిజెక్ట్ చేస్తే.. అమ్మాయికి హానీ చేయాలనుకునే అబ్బాయిలు ఉన్నట్టుగానే.. ఆ అమ్మాయి అర్థం చేసుకునే తప్పుకునే వ్యక్తులు కూడా ఉన్నారు.
ప్రేమ రిజెక్ట్ అయిన తర్వాత.. సింగిల్ కింగ్స్ లేదా సింగిల్ క్వీన్స్ అని చెప్పుకొని రాయల్‌గా తిరిగేవారి మనసులో కూడా ఎంతో బాధ ఉంటుంది. అటు ప్రేమించిన వారి మీద ఆశలు చంపుకోలేక.. ఇటు ఇంకొక వ్యక్తిని జీవితంలోకి రానివ్వలేక.. సతమత పడుతుంటారు. మూవ్ ఆన్ అయిపోదామని జీవితంలో ముందడుగు వేసేవారు కొందరైతే.. ఆ జ్ఞాపకాలతోనే మిగిలిపోయే వారు మరికొందరు. అలాంటి వన్ సైడ్ లవర్స్ చెప్పే ప్రేమకథలు మనసును హత్తుకునేలా ఉంటాయి.
ఇక వన్ సైడ్ లవర్స్‌లో మరో రకం ఇంట్రోవర్ట్స్. నలుగురితో ఎక్కువగా కలవలేని వారు, అందరి ముందు మాట్లాడడం తెలియని వారు కూడా ప్రేమలో పడతారు. కానీ ఆ ప్రేమను అవతల వ్యక్తికి చెప్పే ధైర్యం ఉండదు. అలా కళ్ల ముందే కావాల్సిన ప్రేమను దూరం చేసుకున్నవారు కూడా ఉన్నారు. భయాన్ని దాటి ముందుకెళ్లినప్పుడే.. ప్రేమను దక్కించుకోవచ్చు అని తెలుసుకోలేని వారు ఈ కేటగిరికి చెందుతారు. అందుకే అలాంటి ఎంతోమంది వన్ సైడ్ లవర్స్, ఇంట్రోవర్ట్స్ కూడా తమ ప్రేమను బయటికి చెప్పే అవకాశం ఈ వాలెంటైన్స్ డే అందిస్తుంది.