Big Stories

10 Movies on Single Day: ఒకేరోజు పదికిపైగా సినిమాలు రిలీజ్.. ఎప్పుడో తెలుసా..?

More than 10 New Movies Release in Theaters on August 15th: సినిమా లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఒకేరోజు పదికిపైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే రోజు సినిమా లవర్స్‌ కోసం మేకర్స్ కొత్త సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల జోరు పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఆగస్టు 15న గట్టిగానే సినిమాలు రిలీజ్ కానున్నాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న మీడియం రేంజ్ సినిమాలు సైతం ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో చూద్దామా?

- Advertisement -

రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, కీర్తీ సురేష్ ‘రఘు తాతా’, నివేతా థామస్ ‘35-చిన్న కథ కాదు’, నార్నే నితిన్ ‘ఆయ్:మేం ఫ్రెండ్స్ అండి’వంటి సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానున్నాయి.

Also Read: Vijay Devarakonda: జస్ట్ క్యామియోకే ఇంత రచ్చనా.. అర్జునా.. ఏం చేశావయ్యా

అయితే తెలుగులో ఇంకా కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. కానీ ఆగస్టు 15న విడుదల అవుతున్నట్లు సమాచారం. వీటిలో దుల్కర్ సల్మాన్ ‘లక్కీభాస్కర్’, గోపీచంద్ ‘విశ్వం’, సినిమాలు కూడా ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తమిళనాడులో విక్రమ్ ‘తంగలాన్’తోపాటు మరో రెండు సినిమాలు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. ఇక, హిందీలో అక్షయ్ కుమార్ ‘భేల్‌ఖేల్‌మే’, జాన్ అబ్రహం ‘వేద్’, శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమాలు సైతం ఆగస్టు 15న విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాలే కాకుండా అదే రోజు మరికొన్ని సినిమాలు విడుదల చేసేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.

మలయాళం, కన్నడం భాషల నుంచి ఆగస్టు 15ను టార్గెట్ చేసుకొని మరో నాలుగు సినిమాలు విడుదల చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇలా ఒకే రోజు మొత్తం పదికిపైగా సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. దీంతో ఆగస్టు 15న అన్ని థియేటర్స్ ప్రేక్షకులతో పండగ వాతావరణం సంతరించుకోనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News