Big Stories

Nandamuri Balakrishna: అభిమానితో భోజనం.. అదిరా బాలయ్య అంటే..

Nandamuri Balakrishna:మన్మథుడు సినిమాలో నాగార్జున క్యారెక్టర్ గురించి తనికెళ్ల భరణి ఒక డైలాగ్ చెప్తాడు. “వాడి కోపం ప్రళయం.. వాడి ప్రేమ సముద్రం.. వాడి జాలి వర్షం”. రియల్ గా ఈ క్యారెక్టర్ నందమూరి బాలకృష్ణకు వర్తిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అని ఇప్పటివరకు ఎన్నో సందర్భాలు నిరూపించాయి.

- Advertisement -

కోపంలో బాలయ్య ఏది చేసినా కూడా అది అక్కడవరకు మాత్రమే. అందుకే బాలయ్య అభిమానులు.. ఆయనతో కొట్టించుకున్నా కూడా సీరియస్ గా తీసుకోరు. బాలయ్య కోపం ప్రళయం అయితే.. ఆయన ప్రేమ సముద్రం. ఎంతోమంది క్యాన్సర్ పేషేంట్స్ కు జీవితాన్ని అందిస్తున్నాడు. చిన్నపిల్లలకు వైద్యం చేయిస్తున్నాడు. ఇలా ఒకటని కాదు చాలా ఉన్నాయి.

- Advertisement -

ముఖ్యంగా తన మన అనే బేధం లేకుండా అభిమానులతో కూర్చొని తినడం అనేది ఒక్క బాలయ్యకే చెల్లింది. ఒక స్టార్ హీరో అనే గర్వం లేకుండా, ఒక ఎమ్మెల్యే అనే హోదాను మరిచి తన అభిమానితో కలిసి ఇదుగో ఇలా భోజనం చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం బాలకృష్ణ NBK107 షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కర్నూల్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న బాలయ్య అభిమాని సజ్జద్.. ఆయనను కలవడానికి కుటుంబంతో వచ్చాడు. షూటింగ్ గ్యాప్ లో బాలయ్య.. సజ్జద్ ను కలవడమే కాకుండా ఆ కుటుంబం తో  కలిసి లంచ్ చేశాడు. వారితో కూర్చొని, వారికి వడ్డిస్తూ భోజనం చేశాడు. అనంతరం ఆ కుటుంబంతో కొద్దిసేపు ముచ్చటించి.. వారికి ఫోటోలు ఇచ్చి పంపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. అదిరా మా బాలయ్య అంటే.. ఏ హీరో అయినా ఇలా చేశాడా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదైనా బాలయ్య తప్పుగా మాట్లాడినా, కోపంతో మాట్లాడినా ట్రోల్ చేసే బ్యాచ్.. ఇలాంటివీడియోలపై నోరు మెదపరే అని చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News