Mohan Babu to Remake this Malayalam : డైలాగ్ కింగ్ మోహన్ బాబు మలయాళం రీమేక్‌లో నటించనున్నారు. తనయుడు మంచు విష్ణు దీన్ని నిర్మించనున్నారు. మలయాళంలో 2019లో ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 సినిమా విడుదలై మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణే స్వయంగా వెల్లడించాడు.
“ఆండ్రాయిడ్ కుంజప్పన్” సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నామని… ప్రధాన పాత్రను మోహన్ బాబు పోషిస్తారని విష్ణు చెప్పాడు. కొడుకు పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నాం. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొంత మార్పులను చేయనున్నాం” అని మంచు విష్ణు ప్రకటించారు.
సన్ ఆఫ్ ఇండియా చిత్రం తరువాత మోహన్ బాబు.. మంచు లక్ష్మితో కలిసి “అగ్ని నక్షత్రం” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25… మలయాళంలో నవంబర్ 8, 2019లో రిలీజ్ అయింది. రతీస్ బాలకృష్ణన్ పొడువల్ దీనికి దర్శకత్వం వహించారు.
సూరజ్ వెంజరమూడు, సౌబిన్ శాహిర్, సూరజ్ తెలక్కడ్ ప్రధాన పాత్రలో నటించారు. సంతోష్ టి. కురువిల్ల దీన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొత్తం సైన్స్ ఫిక్షన్‌తో సాగే కథలో కామెడి కూడా ఉండడంతో ప్రేక్షకులను బాగా అలరించింది.
Leave a Comment