Big Stories

Mohan Babu: నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది… చూద్దురు అనేవారు

Mohan Babu: ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు నేడ స్వర్గస్తులు అయిన విషయం తెల్సిందే. గుండె సంబంధింత సమస్యలతో పోరాడుతూ ఆయన 88 ఏళ్ళ వయస్సులో మృతి చెందారు. మీడియా ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం తీరని లోటు అని సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -

అంతేకాకుండా ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం వద్ద రామోజీరావు పార్దీవ దేహానికి నివాళులు అర్పించడానికి సినీతారలు పోటెత్తారు. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. రామోజీరావు జీవితంలో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. బతికి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు. తనకు మరణం అంటే భయం లేదు అని చెప్పటానికి ఆయన జీవించి ఉన్నప్పుడే స్మారకం ఏర్పరుచుకున్నారు. ఈ విషయాన్ని మోహన్ బాబు గుర్తుచేసుకున్నాడు.

- Advertisement -

రామోజీరావుకు నివాళులు అర్పించిన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. ” రామోజీరావు గారితో నాకు 43 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవారు, నేను కూడా పర్సనల్ గా వచ్చి కలిసి మాట్లాడేవాడిని. మేము కలిసినప్పుడు ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. ఎలా ఉండాలి, సొసైటీలో ఏం జరుగుతోంది అని మాట్లాడుకునేవాళ్ళం.

నేను ఎప్పుడు కలిసినా రెండు గంటల పాటు కదలనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా రండి, నేను చనిపోతే నా సమాధి ఉంది.. చూద్దురు అనేవారు. ఏమండి మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను కానీ మీ సమాధిని నేనెందుకు చూడాలి అని నేను అనేవాడిని. అయితే మీరు ధైర్యస్తులు కదా ఎందుకు అంత పిరికితనంగా ఉంటారు అని పిలిచినా నేను ఎప్పుడూ వెళ్ళలేదు” అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News