Big Stories

Sirish Bharadwaj Death News: బ్రేకింగ్.. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి..!

Chiranjeevi Ex Son in Law Sirish Bharadwaj Passed Away: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. గత కొంతకాలంగా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోవడంతో.. వీరిద్దరూ పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమ వివాహం ఇండస్ట్రీని షేక్ చేసింది. శిరీష్ తో పెళ్లి కోసం మెగా కుటుంబం మీదనే శ్రీజ పోలీస్ కేసు పెట్టింది. మీడియా ముందుకు వెళ్లి తమకు ప్రాణహానీ ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇక వీరి పెళ్లి తరువాత మెగా కుటుంబం ఏమి మాట్లాడలేదు.

- Advertisement -

ఇక ఆ తరువాత కొన్నేళ్ళకు వీరి ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో శ్రీజ.. అతని వదిలేసి చిరు వద్దకు వచ్చేసింది. వీరిద్దరికి విడాకులు ఇప్పించిన చిరంజీవి.. శ్రీజకు మరో పెళ్లి చేశాడు. ఇక అప్పటికే శ్రీజ-శిరీష్ కు ఒక పాప ఉంది. ప్రస్తుతం ఆ పాప కూడా చిరు వద్దనే పెరుగుతుంది. ఇక శిరీష్ సైతం శ్రీజ తో విడాకుల తరువాత మరో వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా రాజకీయాల్లో చేరి యాక్టివ్ గా కూడా ఉన్నాడు.

Also Read: Pavitra: ముగ్గురు పవిత్రలు.. కన్నడ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించారా.. ?

బీజేపీ లో చేరిన శిరీష్ కొన్నేళ్లుగా సైలెంట్ గా మారాడు. ఈ నేపథ్యంలోనే అతనికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో అతన్ని కాపాడలేకపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే తండ్రిని కడసారి చూపించడానికి.. శ్రీజ, కూతురును తీసుకువస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News