Big Stories

Kushitha Kallapu: చీరకట్టులో బజ్జీల పాప.. ఏమా అందం.. ఏమా అందం

Kushitha Kallapu: కుషిత కల్లపు అనగానే ఎవరామె అనేస్తారేమో.. అదే బజ్జీల పాప అని చెప్పండి టక్కున గుర్తుపట్టేస్తారు. పబ్ కు ఎందుకు పోయావ్ పాప అంటే.. బజ్జీలు బావుంటాయి అని చెప్పి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎలాగోలా ఆ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకుంది. అంతకుముందు ఎవరికి తెలియని ఈ చిన్నది.. ఆ ఇన్సిడెంట్ జరిగాక ఫేమస్ అయ్యింది. అంతేనా వరుస అవకాశాలను కూడా అందుకుంది.

- Advertisement -

గుంటూరు కారం సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కుషిత కనిపిస్తుందని ముందు చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఎడిటింగ్ లో ఆమెను లేపేయడంతో చాలా ఫీల్ అయ్యింది. ఇక ఛాంగురే బంగారు రాజా, నీతేనే నేను లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాబు నెంబ‌ర్‌వ‌న్ బుల్షిట్ గాయ్, మ‌నోహ‌రం అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. అమ్మడు తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నిరోజులుగా చీరకట్టులో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా మరోసారి చీరకట్టులో మెస్మరైజ్ చేసింది. మెరూన్ కలర్ చీరలో ఈ చిన్నది ఎంతో అద్భుతంగా కనిపించింది. నిండుగా చీరకట్టు కొట్టుకొని, జుట్టును క్లిప్ తో బంధించి.. సన్నని చైన్ వేసుకొని.. ఎక్కువ మేకప్ లేకుండా అచ్చతెలుగు ఆడపిల్లలా దైవ దర్శనం చేసుకుంది.

ప‌క్కా హైద‌రాబాదీ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తుండడం విశేషం. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆగుతారా.. ఏమా అందం.. ఏమా అందం.. ఇలలో లేదు ఈ సౌందర్యం అంటూ సాంగ్స్ పాడుతున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది తెలుగులో మంచి సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News