Big Stories

Krithi Shetty: ఉప్పెన పాప.. హిట్ కొట్టిందిరోయ్

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ కృతి శెట్టి. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకొని.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కృతి.. ఉప్పెనతోనే హీరోయిన్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే బేబమ్మ గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపు ఎలాంటింది అంటే.. ఉప్పెన రిలీజ్ అవ్వకముందే ఆమె వరుస సినిమాలలు సైన్ చేసింది. స్టార్ హీరోలందరూ కృతి మాత్రమే కావాలని పట్టుబట్టారు.

- Advertisement -

ఇక ఒకేసారి నేమ్, ఫేమ్ రావడంతో కృతికి ఊపిరి ఆడలేదు. ఏ సినిమా వస్తే ఆ సినిమాను ఒప్పేసుకుంది. అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు. హీరోలు, బ్యానర్లు చూసింది కానీ, కథను చూసుకోలేదు. ఇక ఉప్పెన తరువాత కృతి ఇప్పటివరకు అరడజను సినిమాల్లో నటించింది. ఏ ఒక్కటి.. హిట్ అందుకుంది లేదు. పోనీ హిట్ అందుకున్నా ఆ హిట్ ఆమె ఖాతాలోకి రాలేదు. ఇక దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న బేబమ్మ.. ఆచితూచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే శర్వానంద్ సరసన మనమే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకుంటుంది. కథలో అమ్మడికి మంచి పాత్రనే దొరికినట్లు చెప్పుకొస్తున్నారు. అందం పరంగా కూడా కృతి ఆకట్టుకుందని అంటున్నారు. ఎవరో తెలియని పిల్లాడిని పెంచే బాధ్యత తీసుకొని.. పెళ్ళికి ముందే తల్లిగా మారే పాత్రలో కృతి ఒదిగిపోయిందని టాక్ నడుస్తోంది. మనమే కరెక్ట్ టైమ్ లో రిలీజ్ అయ్యింది.

గతవారం రిలీజ్ అయిన మూడు సినిమాలు మిక్స్డ్ టాక్ ను అందుకున్నాయి. ఈ వారం మనమే తో పాటు రిలీజ్ అయిన సినిమాలు మంచి టాక్ నే అందుకున్నా మనమే ఫ్యామిలీ డ్రామా కావడంతో కుటుంబాలు ఈ సినిమా వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఓరి బాబో రొట్ట సినిమా అని కాకుండా ఒకసారి చూడొచ్చు అనే టాక్ రావడంతో మరో పెద్ద సినిమా వచ్చేవరకు మనమే థియేటర్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో కృతి ఎట్టకేలకు హిట్ కొట్టినట్టే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇకనుంచి అయినా కృతి.. ఆచితూచి అడుగులు వేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News