Big Stories

Renuka Swamy Murder Case: భార్యను వదిలేసి హీరోయిన్‌తో దర్శన్ సహజీవనం.. ప్రశ్నించిన అభిమాని హత్య!

Actor Darshan:ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్న పేరు దర్శన్. కన్నడలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న దర్శన్ తాజాగా తన అభిమానిని కొట్టి చంపిన ఆరోపణల మీద అరెస్టు అయ్యాడు. అయితే మరి ఇంతకీ ఏమైంది. తన అభిమానినే కొట్టి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయానికొస్తే..

- Advertisement -

కన్నలో ఛాలెంజింగ్ స్టార్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న దర్శన్ ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే 2000 సంవత్సరంలో విజయలక్ష్మి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. కొన్నాళ్లు హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలోనే దర్శన్ నటి నిఖిత అనే అమ్మాయితో సహజీవనం చేసినట్లు వార్తలొచ్చాయి.

- Advertisement -

ఈ విషయంపై దర్శన్ భార్య కూడా ఫిర్యాదు చేయగా.. నటి నిఖితను కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అప్పటికైనా దర్శన్ తగ్గుతాడు అనుకుంటే అలా జరగలేదు. ఆ తర్వాత కూడా నటి నిఖితతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అనంతరం సైలెంట్ అయ్యాడు. అక్కడతో ఆగలేదు.. ఆ తర్వాత కూడా పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం చేసినట్లు ఆ మధ్య వార్తలు జోరుగా సాగాయి.

Also Read: బ్రేకింగ్.. ‘పోకిరి’ మూవీ రీమేక్ హీరో అరెస్ట్..!

అయితే ఇప్పటికీ దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలోనే మరో కన్నడ హీరోయిన్ అయిన పవిత్ర గౌడ్‌తో సహజీవనం చేస్తున్నాడు. అదే సమయంలో దర్శన్ అభిమాని అయిన చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుక స్వామి.. నటి పవిత్ర గౌడ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలపై అసభ్యకరంగా కామెంట్లు పెట్టేవాడు. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్రనే కారణమని.. ఆయనను వదిలేయాలని అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేసేవాడు.

అయితే ఈ విషయంపై నటుడు దర్శన్ అండ్ నటి పవిత్ర గౌడ్ కొన్నాళ్లపాటు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ రేణుక స్వామి అంతకంతకు రెచ్చిపోతుండటంతో అతడికి వార్నింగ్ ఇవ్వాలని వీరిద్దరూ ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో దర్శన్ తన అభిమాన సంఘం నాయకులతో రేణుక స్వామిని కిడ్నాప్ చేయించాడు. ఆపై బెంగళూరులో తనకు తెలిసిన ఓ అభిమానికి చెందిన గొడౌన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ రేణుక స్వామి మీద దాడి చేయడమే కాకుండా చివరికి హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అనంతరం రేణుక స్వామి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో డంప్ చేశారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. రేణుక స్వామిని హత్య చేస్తున్న సమయంలో దర్శన్ అండ్ పవిత్ర అక్కడే ఉన్నట్టుగా సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు కనిపెట్టారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నిందుతులను పట్టుకోగా.. వారు దర్శన్ పేరు చెప్పారు. దీంతో పోలీసులు తాజాగా దర్శన్‌ను కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దర్శన్‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు వారికి వారంరోజులు రిమాండ్ విధించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News