Big Stories

Kanguva vs Vettaiyan: రజనీకాంత్‌తో పోటీకి దిగిన సూర్య..తలైవాతో యుద్ధమే!

Surya competes with Rajinikanth: తమిళ పరిశ్రమలో దసరాకు బాక్సాఫీస్ వద్ద యుద్ధమే జరగనుంది. రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’, సూర్య నటిస్తున్న ‘కంగువా’ మధ్య భీకర పోరు ఉండనుంది. అయితే కంగువాకు జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ నిర్మించాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కంగువా’ మూవీ అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా.. విలన్‌గా బాబీ డియల్, హీరోయిన్‌గా దిశా పటానీ నటించారు.శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజే జ్ఞానవేల్‌, వంశీ, ప్రమోద్ నిర్మించారు.

- Advertisement -

హీరో సూర్య పాన్ ఇండియా లెవల్‌లో స్టార్ డమ్ ఉన్న సంగతి తెలిసిందే. కథల ఎంపికలో సూర్య ప్రత్యేకంగా ఉంటారు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువా కథ ఎంచుకున్నాడు. డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఈ సినిమా కథనం సాగుతోంది. 18వ శతాబ్ధంలో అంతుచిక్కని వ్యాధితో చనిపోయిన ఓ యుద్ధవీరుడు పునర్జన్మ నేపథ్యంలో ‘కంగువా’ సినిమా కథనం ఉంటుందని తెలుస్తోంది.

Also Read: బికినీలో వెంకటేష్ రీల్ కూతురు.. ఏమన్నా చూపిస్తుందా.. ?

అయితే,టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన రజినీ కాంత్ ‘వేట్టయాన్’ కూడా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలు విడుదల చేయడం వల్ల కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది. ఈ విషయంలో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలై ఏది హిట్ అవుతుందో చూడాలి మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News