Big Stories

Kalki 2898 AD: పురాణాలు అన్నింటికి కల్కి క్లైమాక్స్.. కథ మొత్తం చెప్పేసిన నాగ్ అశ్విన్

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 AD. . వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. అమిత బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, నిన్న రిలీజ్ అయిన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా తీసుకొచ్చి పెట్టాయి. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. వరుసగా సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ.. వారు ఎంత కష్టపడ్డారో చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

తాజాగా నాగ్ అశ్విన్.. కల్కి కథ గురించి చెప్పుకొస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కల్కి కథ.. పురాణాల అన్నింటికి క్లైమాక్స్ అని చెప్పుకొచ్చాడు. ప్రపంచం లో ఎవరైనా రిలేట్ చేసుకోవచ్చని స్పష్టం చేశాడు. ” చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు చూశా. నా ఫేవరెట్ మూవీ పాతాళభైరవి. భైరవ ద్వీపం, ఆదిత్య 369, హాలీవుడ్ స్టార్ వార్స్ లాంటి సినిమాలు చూసినప్పుడు కూడా చాలా బాగున్నాయనిపించింది. స్టార్స్ వార్స్ లాంటి సినిమాలు ఇవి మన స్టోరీలు కావా.. ఎప్పుడూ అన్నీ వెస్ట్‌లోనే జరగాలా అని అనిపించేవి.

మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మ‌హాభారతం లో శ్రీ‌కృష్ణుడి అవ‌తారంతో ఎండ్ అవుతుంది. అక్కడినుంచి క‌లియుగంలోకి ఎంటర్ అయ్యినప్పుడు ఈ క‌థ ఎలా వెళ్తుంది అనేది కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేయొచ్చు. కృష్ణుడు అవతారం తరువాత దశావతారం కల్కి.. కలియోగంలో ఎలా జరగబోతుంది.. ?ఎలా జరగొచ్చు.. ? ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా రిలేట్ చేసుకోవచ్చు. ఈ కథ అన్నింటికి క్లైమాక్స్. మనం చదివిన అన్ని పురాణాలకు ఇది ఎండ్ లాంటిది.

కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు. ఒక్కో యుగంలో ఒక్కో రూపం తీసుకుంటాడు. ఒకసారి రావణుడిలా.. ఒకసారి దుర్యోధనుడిలా ఉంటాడనుకుంటే.. చివరగా కలియుగంలో ఫైనల్ రూపం తీసుకుంటే అలాంటప్పుడు ఎలాంటి హీరో వస్తాడనే ఆలోచనతో రాసిన కథ ఇది. చీకటి, వెలుగు క్లైమాక్స్ ఏంటని ఐడియా పెట్టుకొని రాసుకుంటే ఈ కథకు ఐదేళ్లు పట్టింది. ఇలాంటి కొత్త సైన్స్ ఫిక్షన్ మైథలాజీ చూస్తే ప్రజలు ఎలా ఫీల్ అవుతారు అనేది చూడాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News