Big Stories

Kalki 2898 AD: ‘కల్కి’ సినిమాలో జక్కన్న, ఆర్జీవీ, అనుదీప్.. సడెన్‌ సర్ ప్రైజ్ ఇచ్చిన స్టార్స్.. మొత్తం ఎంత మంది అంటే..?

Celebrities Surprise in Kalki 2898 AD Movie: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీని మహాభారతం వంటి పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

- Advertisement -

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించారు. ఈ మూవీ కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల వంటి మూడు ప్రపంచాలను దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఈ మూడు కథల ఆధారంగా సినిమా సాగుతోంది.

- Advertisement -

‘కల్కి’ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రభాస్‌తో పాటు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుమతిగా దీపికా పదుకొణె, సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ ఎక్స్టార్డినరిగా చేశారు. అదేవిధంగా శోభన, దిశా పటానీ, మాళివిక నాయర్‌లు కీలక పాత్రలో నటించారు.

Also Read: Kalki 2898 AD First Day Collections: బాక్సాఫీసు రారాజు.. ప్రభాస్ రాజు.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

ఇక మూవీ విషయానికొస్తే.. మహాభారతంతో మొదలయ్యే ఈ మూవీ.. ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఇందులో ప్రభాస్ ఫన్నీగా ఆకట్టుకున్నాడు. ప్రభాస్ స్క్రీన్‌పై తక్కువగా కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వేరే లెవల్ గా తీర్చిదిద్దారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో సినిమా మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది.

సర్ ప్రైజ్ ఇచ్చిన స్టార్స్ వీళ్లే..
కల్కి మూవీలో చాలామంది స్టార్స్ గెస్ట్ రూల్స్‌లో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు. బౌంటీ హంటర్ అనే పాత్రలో జక్కన్న మెరిశారు. అయితే రాజమౌళి ఈ సినిమాలో కనిపించడంతో ఫ్యాన్స్ థియేటర్స్‌లో హంగామా చేశారు. అయితే రాజమౌళి తన సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తాడనే విషయం తెలిసిందే.

Also Read: Tamannaah Bhatia – Ranveer Singh: పాఠ్యపుస్తకాల్లో తమన్నా, రణ్‌వీర్ సింగ్ లైఫ్ స్టోరీ.. ఫైర్ అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు..

అదే విధంగా మరో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా సందడి చేశారు. ఆర్జీవీ చింటూ అనే క్యారెక్టర్‌లో ఓ బిజినెస్ డీలర్‌గా నటించాడు. అంతేకాదు.. ప్రభాస్‌కు షాక్ ఇచ్చేలా తనదైన డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా వర్మ స్క్రీన్‌పై కనిపించగానే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలాగే మరో పాత్రలో కేవీ అనుదీప్ సైతం నటించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్టార్ డైరక్టర్స్‌తోపాటు ప్రముఖ హీరోలు స్క్రీన్‌పై సందడి చేశారు. హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ దేవరకొండ, హీరోయిన్స్ మృణాళ్ ఠాకూర్, మాళవిక నాయర్, ఫరియా అబ్ధుల్లాలు కూడా నటించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రభాస్ నడిపే ప్రధానమైన బుజ్జి కారుకు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ అందించింది. వీరందరూ కథకు తగ్గట్లుగా గెస్ట్ రోల్స్ పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్‌లో దుమ్ము రేపుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్ వేసేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News