Big Stories

Kalki 2898 AD Facts: ‘కల్కి 2898 AD’ మూవీ రీలీజ్‌కు కౌంట్‌డౌన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

Unknown Facts about Prabhas Kalki 2898 AD Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీకోసం ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్, భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘కల్కి’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

దేశంలో సినీ ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్‌తో ‘కల్కి 2898 ఏడీ’ రూపొందించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ మూవీకి రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేశారు. వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేశారు.

కల్కి మూవీలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్‌గా ప్రతి నాయకుడి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు. వీరిద్దరూ 40 ఏళ్ల క్రితం ‘గిరాఫ్తార్’లో నటించారు. మళ్లీ ఇప్పుడు నటించడంతోపాటు వీరితో కలిసి రజనీకాంత్ కూడా నటించడం మరో విశేషం.

Also Read: Vijay Devarakonda: జస్ట్ క్యామియోకే ఇంత రచ్చనా.. అర్జునా.. ఏం చేశావయ్యా

ఈ మూవీలో ఒక్క కారు కోసం ఏకంగా రూ.4కోట్లు ఖర్చు చేశారు. ప్రభాస్ రైడ్ చేసే వెహికల్‌ను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ తోపాటు కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ సహకారం అందించారు. ఇంకా ఇందులో కమల్ హాసన్ లుక్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి హాలీవుడ్ సినిమాలకు పనిచేసే మేకప్ నిపుణులతో చేయించినట్లు తెలుస్తోంది.

అమితాబ్ పాత్ర అశ్వత్థామ మేకప్ వేయడానికి 3 గంటల సమయం పడితే..వేసిన మేకప్ తీసేందుకు 2 గంటలు పట్టేదని మేకర్స్ తెలిపారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. మనం, సైరా సింహారెడ్డి తర్వాత అమితాబ్ నటించిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

కల్కి కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుందిని దర్శకుడు తెలిపారు. కాశీ పట్టణంతోపాటు అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందు కోసం శంబల అనే ప్రాంతాన్ని చూపించారు. మంచి లుక్ కోసం వీఎఫ్ఎక్స్ కోసం దాదాపు 700 షాట్స్ ఉపయోగించారట.

Also Read: Kalki2898AD: కల్కి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎందులో చూడొచ్చు అంటే.. ?

ఈ మూవీకి ప్రైమ్ ఫోకస్, డీఎన్ఈజీ, దిఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు పనిచేయగా.. హాలీవుడ్ చిత్రాలైన హ్యారీపోటర్, ఇంటర్ స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి సినిమాలు పనిచేసిన టీమ్ ఇందులో కూడా పనిచేసింది.

కల్కి షూటింగ్ కోసం ఐ మ్యాక్స్ డిజిటల్ కెమెరా ఉపయోగించారు. అలాగే దీపిక పదుకొణె నటింస్తున్న తొలి తెలుగు మూవీ కావడం విశేషం. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లోనే అత్యంత వేగంగా 3 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

కల్కి మూవీలో సందడి చేసిన ఏఐ బుజ్జి పాత్రకు హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ అందించారు. ఇక, ఈ మూవీని 2030లో ప్రకటించగా.. రేపు విడుదలవుతోంది. అంటే మూవీ పూర్తి చేసేందుకు 4ఏళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంది.

Also Read: Kalki2898AD Review: కల్కి రివ్యూ.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికేసినట్టే..

అలాగే ఈ మూవీ 2D, 3D, IMAX, 4DXలో విడుదల చేస్తున్నారు. విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు మూవీ ‘కల్కి’ కావడం గమనార్హం.

కల్కి మూవీ మరికొన్ని సర్ ప్రైజ్‌లు ఉన్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రముఖ హీరోలు నటించనట్లు వార్తలు వస్తున్నాయి. నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ ఉన్నారని టాక్. ఈ విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News