Big Stories

Kala Master: జ్యోతికకు డ్యాన్స్ రాదు.. చంద్రముఖి సినిమాకు డ్యాన్స్ నేర్పిస్తే ఆమె ఏం చేసిందంటే.. ?

Kala Master కొరియోగ్రాఫర్ కళ మాస్టర్ గురించి తెలుగు వారికి చాలా తక్కువ తెలుసు. ఎక్కువ ఆమె తమిళ్ చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తుంది. 12 ఏళ్ల వయసులో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టిన కళకు కమల్ హాసన్ నటించిన పున్నగై మన్నన్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండాపోయింది. స్టార్ డైరెక్టర్స్ సైతం కళనే కావాలని ఏరికోరి పెట్టుకొనేవారట.

- Advertisement -

తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ, ఇంగ్లీష్, ఇటాలియన్, జపనీస్‌తో సహా వివిధ భాషలలో 4000 పాటలకు పైగా పనిచేసింది. మలయాళం చలనచిత్రం కొచు కొచు సంతోషంగల్‌లో ఆమె జానపద నృత్య సన్నివేశాలకు 2000లో ఉత్తమ కొరియోగ్రఫర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఇక చంద్రముఖి సినిమాలోని వారాయ్ సాంగ్ కు నేషనల్ అవార్డును అందుకుంది. ఆ పాట సమయంలో ఆమెను ఎంతోమంది విమర్శించారట. ఆ విషయాన్నీ కళ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

- Advertisement -

రజినీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యి ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో హైలైట్ అంటే.. రారా( వారాయ్) సాంగ్. చంద్రముఖిగా మారిన దుర్గ డ్యాన్స్ వేస్తూ .. వెట్టాయన్ గదికి వెళ్తుంది. ఇక ఈ సినిమాలో జ్యోతిక ఒక రాజ నర్తకి. కానీ, ఆమెకు బయట డ్యాన్స్ రాదట. ఆ సమయంలో ఆమెకు డ్యాన్స్ నేర్పించడం చాలా కష్టంగా మారిందని కళ చెప్పుకొచ్చింది.

” జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. ఆమెకు ఆ స్టెప్స్ నేర్పించేసరికే ఎక్కువ సమయం పట్టింది. డ్యాన్స్ రానీ అమ్మాయితో అలాంటి పాట చేయించడం చూసి అందరు నన్ను విమర్శించారు. కానీ, జ్యోతిక చాలా త్వరగా నేర్చుకుంది. రెండు రోజుల్లోనే ఆ సాంగ్ ను ఫినిష్ చేసాం. రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. ఎడిటింగ్ అయ్యాకా సాంగ్ చూసి జ్యోతిక ఎంతో సంబరపడింది. అక్కడిక్కడే నాకు డైమండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నేను షాక్ అయ్యాను. మలయాళ సినిమా చూడకుండానే ఆమెకు డ్యాన్స్ నేర్పించాను. అసలు డ్యాన్సేరానివారు నా శిక్షణ వలన డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా అద్భుతం ఏముంటుంది” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కళ.. చెన్నెలో ఐదు డ్యాన్స్ స్కూల్స్ ను నడుపుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News