Big Stories

Satyabhama OTT Released: ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’.. ఎందులో చూడొచ్చంటే?

Satyabhama movie OTT release date(Latest news in tollywood): సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటీమణులలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. గత 20 ఏళ్లుగా సినీ కెరీర్‌లో కొనసాగుతూ సత్తా చాటుకుంటోంది. స్టార్ హీరోలతో జోడీ కట్టి ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తన తన సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

- Advertisement -

ఈ క్రమంలో తన ఫుల్ టైం‌ను ఫ్యామిలీకే కేటాయించింది. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతుంది. బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది చందమామ కాజల్. ఆ తర్వాత లేడీ ఓరియేంటెడ్ మూవీ చేసింది. అదే ‘సత్యభామ’. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి అదరగొట్టేసింది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్‌ను రిలీజ్ చేస్తూ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. దీంతో కాజల్ సత్యభామ సినిమా చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూశారు.

- Advertisement -

ఈ తరుణంలో ఎన్నో అంచనాలతో జూన్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కినప్పటికీ సినిమాలో చాలా విషయాలు టచ్ చేస్తూ వెళ్లడంతో.. ఏ విషయాన్ని సరిగ్గా చూపించలేకపోయారని కామెంట్లు వినిపించాయి. ఈ కారణంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఒటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read: ఇవాళ 6 గంటలకు కాజల్‌తో కలిసి ‘సత్యభామ’ సినిమా చూసే అవకాశం.. ఇలా చేయండి..

ఈ నేపథ్యంలో వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. కాజల్ సత్యభామ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీ బాట పట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అదీగాక ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్‌గా వచ్చేసింది.

ఏది ఏమైనా ఈ మూవీని థియేటర్లలో చూడని వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఇటీవల ఈ మూవీ ఈవెంట్‌లో దర్శకుడు కాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ 2 సినిమాలో కాజల్ ఉండదని.. ఇండియన్ 3లో ఆమె పాత్ర ఉంటుందని చెప్పాడు. దీంతో కాజల్‌ను ఈ సినిమాలో చూడాలని ఎంతగానో పరితపించిన వారికి నిరాశే ఎదురైందని చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News