Big Stories

Samantha: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో సమంత.. నిజమేనా ?

Actress Samantha: మయోసైటిస్ వ్యాధి బారిన పడిన స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. వరుసగా సినిమాలను ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తుంది. మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తున్న ఈ ముద్దుగుమ్మ నిర్మాతగా కూడా మారబోతుంది. సినిమాలతోపాటు యాడ్స్ కూడా చేస్తుంది. ఇదిలా పక్కన పెడితే.. ఇటీవలే సమంత బాలీవుడ్ లో మరో సినిమాను ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఒక సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజ్ కుమార్ హిరానీ – షారుక్ కాంబోలో వచ్చిన డింకీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని ఈ కాంబో కసిగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Samantha
Samantha

పాన్ ఇండియా లెవెల్ కథ కావడంతో డైరెక్టర్ హిరానీ సైతం స్టార్ క్యాస్టింగ్ గట్టిగా తీసుకోవాలని అనుకున్నాడంటా. అందులో భాగంగానే సమంత అయితే హీరోయిన్ పాత్రకు సెట్ అవుతుందని భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక షారుక్ ఖాన్ సినిమా అనేసరికి ఈ అమ్మడు ఎగిరి గంతేసిందంటా. ఎందుకంటే షారుక్ ఖాన్ కి సమంత పెద్ద ఫ్యాన్.

- Advertisement -

Also Read: దేవసేన అనుష్కకు వింత వ్యాధి..లాఫింగ్ డిజార్డర్ ఏంటో తెలుసా?

పలు ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. సూర్య, మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లతో యాక్ట్ చేయడానికి తాను ఇష్టపడుతానంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే సూర్యతో, మహేశ్ బాబుతో సామ్ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు షారుక్ తో నటించే అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పిందంటూ టాక్. ఈ వార్తలో నిజమెంత అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సామ్.. ఇక బాలీవుడ్ లో పాగా వేసినట్టే అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News