Big Stories

Puri Jagannadh Role in Godfather : గాడ్ ఫాదర్‌లో నన్ను ఎలా ఎంపిక చేశారు : పూరీ జగన్నాథ్

- Advertisement -

Puri Jagannadh Role in Godfather : ఇప్పుడు సినీ టౌన్ లో ఎక్కడ చూసినా గాడ్ ఫాదర్ క్రేజ్ కనబడుతుంది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. తాజాగా ఇందులో ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు పూరీజగన్నాధ్.. మెగా స్టార్ తోకలిసి ఇంస్టాగ్రామ్ లో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలని అడిగారు.

- Advertisement -

గాడ్ ఫాదర్ పొలిటికల్ మూవీ కాబట్టి మీకు అందులో నచ్చిన పాత్ర ఏంటి అని అడిగారు పూరి.. దానికి చిరు.. “ఇప్పటి నాయకులు అప్పటిలా లేరు.. అట్టర్ బిహారీ వాజ్పాయ్, లాల్ బహదూర్ శాస్త్రి అంటే నాకు ఎంతో ఇష్టం అన్నారు మెగాస్టార్..

మొదటి సారి సల్మాన్ ఖాన్ ను ఎక్కడ కలిసారని అడిగినప్పుడు.. ఓ వాణిజ్య ప్రకటనలో కలిశానని చెప్పారు. సల్మాన్ హిందీలో ఆ యాడ్ చేస్తే.. తాను తెలుగులో చేసినట్టు చెప్పారు. సల్మాన్ కు నాకు మధ్య మంచి స్నేహబంధం ఉంది. చరణ్ అంటే సల్మాన్ కు ఎంతో ఇష్టం. సల్మాన్ ఇచ్చిన జాకెట్ ఇప్పుడు కూడా చరణ్ దగ్గరే ఉందన్నారు మెగా స్టార్

గాడ్ ఫాదర్ లో యూట్యూబర్ గోవర్ధన్ పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశారని అడిగారు పూరి. చిరు దానికి సమాధానం చెప్తూ.. లొక్డౌన్ లో మీ పోడ్ కాస్టులు చాలా విన్న. మీ కంటెంట్, బాష, వాయిస్ నాకు చాలా నచ్చింది, అందుకే ఆ పాత్రకు మిమ్మల్నే ఎంపిక చేశానన్నారు చిరు

దర్శకుడు మోహన్ రాజనే గాడ్ ఫాదర్ కు డైరెక్టర్ గా ఎందుకు ఎంపిక చేశారని అడిగారు. “మోహన్ రాజాతో నాకు హిట్లర్ సినిమా నుంచి పరిచయం ఉంది. మోహన్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ చిత్రాలు “తని ఒరువన్”, “ధ్రువ” చూసిన తరువాత మోహన్ రాజా మాత్రమే గాడ్ ఫాదర్ కథకి న్యాయం చేస్తారనిపించింది” అని చిరు బదులిచ్చారు.

ఈ ఇంటర్వ్యూ లో లైగర్ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు దర్శకుడు పూరి జగన్నాధ్. “సినిమా హిట్ అయితే పొగుడుతారు లేదంటే ఫూల్ లా చూస్తారు. పరాజయం పొందినప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ నేను తొందరగా ఆ ఒత్తిడి నుంచి బయటకి వస్తా. లైగర్ ఫెయిల్ అయినప్పుడు అలాగే బాధపడ్డ.. కానీ లైగర్ మేకింగ్ లో చాలా ఎంజాయ్ చేశా” అని అన్నారు పూరి జగన్నాధ్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News