Big Stories

Hina Khan: క్యాన్సర్ బారిన పడిన మరో నటి.. మూడో దశలో ఉందంటూ పోస్ట్

Hina Khan latest news(Bollywood celebrity news): ఇండస్ట్రీలో చాలామంది స్టార్స మహమ్మారి క్యాన్సర్ బారిన పడిన విషయం తెల్సిందే. క్యాన్సర్ తోనే చాలామంది మరణించగా.. మరికొందరు ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలను దక్కించుకున్నారు. ఇంకా మరికొందరు ఇప్పటికీ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. తాజాగా మరో నటి ఈ మహమ్మారి బారిన పడింది. బాలీవుడ్ నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిపింది. గత కొన్నిరోజులుగా ఆమెకు అరుదైన వ్యాధి సోకిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆ వార్తలకు చెక్ పెడుతూ.. హీనా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

- Advertisement -

” గత కొన్నిరోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. నన్ను ప్రేమించే మరియు నాపై శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరితో కొన్ని ముఖ్యమైన వార్తలను పంచుకోవాలనుకుంటున్నాను. నేను స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. దీనికి చికిత్స ఉన్నప్పటికీ.. నేను బాగానే ఉన్నానని అందరికీ భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఈ వ్యాధిని అధిగమించడానికి బలంగా నిశ్చయించుకున్నాను.

- Advertisement -

నా చికిత్స ఇప్పటికే ప్రారంభమైంది. దీని నుండి మరింత బలంగా బయటపడేందుకు అవసరమైన ప్రతిదాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి సమయంలో నా మీద గౌరవంతో నాకు ప్రైవసీని ఇవ్వండి. మీరు నామీద చూపించే ప్రేమ, దయకు నేనెప్పుడూ కృతజ్ఞత చూపిస్తాను. మీ వ్యక్తిగత అనుభవాలు, సహాయక సూచనలు నన్ను మరింత దైర్యంగా ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తాయి.

నా కుటుంబం మరియు ప్రియమైనవారు నాకు తోడు ఉన్నారు. సర్వశక్తిమంతుడి దయతో నేను ఈ సవాలును అధిగమించి పూర్తిగా ఆరోగ్యంగా ఉంటానని నేను నమ్ముతున్నాము. దయచేసి మీ ప్రార్థనలను ఆశీర్వాదాలు మరియు ప్రేమను నాకు పంపండి” అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. హీనా ఖాన్ యే రిష్తా క్యా కెహ్లతా అనే సీరియల్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె తరువాత చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News