Big Stories

Guruvayoor Ambalanadayil: భార్యను ప్రేమించినవాడితో చెల్లికి పెళ్లి చేసిన బావ.. అద్భుతమైన కామెడీతో అదరగొడుతున్న సినిమా

Guruvayoor Ambalanadayil: ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన హిట్ సినిమాల్లో ఎక్కువ మలయాళ సినిమాలే ఉన్నాయి. భ్రమ యుగం, ప్రేమలు, ఆవేశం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో మలయాళ సినిమా యాడ్ అయ్యింది. సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన చిత్రం గురువాయూర్ అంబలనాదయిల్.

- Advertisement -

విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్ మరో హీరోగా కనిపించాడు. ఇతను కూడా తెలుగువారికి సుపరిచితుడే. గతేడాది జయజయజయ జయహే అనే సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. అందులో భార్యను టార్చర్ పెట్టే భర్తగా జోసెఫ్ కనిపించి మెప్పించాడు. ఈ హీరోల సరసన నిఖిలా విమల్, అనశ్వర రాజన్ హీరోయిన్స్ గా కనిపించారు.   ఇక ఈ కామెడీ ఎంటర్ టైనర్ మే 16 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

- Advertisement -

ఇక ఈ సినిమా ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని నవ్వుకోదగ్గ సినిమా కావడంతో.. ఓటీటీలో కూడా మంచి విజయాన్ని అందుకొని టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అసలు గురువాయూర్ అంబలనాదయిల్ కథ ఏంటి అనేది తెలుసుకుందాం.

విను రామచంద్రన్(బసిల్ జోసెఫ్) దుబాయ్ లో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి కాలేజ్ టైమ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోవడంతో.. తననే తలుచుకొని ఐదేళ్లుగా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే  వినుకు ఆనందన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) పరిచయమవుతాడు. అతడి గురించి తెలుసుకొని తన చెల్లి అయిన అంజలి(అనశ్వర రాజన్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దీనికోసం వినును మోటివేట్ చేస్తూ.. పాత గర్ల్ ఫ్రెండ్ ను మర్చిపోయేలా చేస్తాడు. ఇంకోపక్క ఆనందన్ కు కోపం ఎక్కువ. తన భార్య పార్వతి(నిఖిలా విమల్)కి ఒక లెటర్ రావడంతో.. ఆమెకు వేరే సంబంధం ఉందనుకొని ఇంటికి పంపించేస్తాడు.

ఇక తనకు ఇంత సహాయం చేస్తున్న బావకు.. ఎలాగైనా తానుకూడా సహాయం చేయాలనీ అనుకోని విను.. ఆనందన్ ను ఒప్పించి భార్యను ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు. బామ్మర్ది చెప్పడంతో భార్యకు ఇంటికి తీసుకొస్తాడు ఆనందన్. పెళ్ళికి ఇంకా పదిరోజులు మాత్రమే ఉండడంతో ఇండియా వచ్చిన విను.. ఆనందన్ కుటుంబాన్ని చూసి షాక్ అవుతాడు. తనకు ఈ పెళ్లి వద్దు అని గోల చేస్తాడు. ఇక అంజలి ఎలాగోలా సర్ది చెప్పడంతో పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఆ సమయంలో ఆనందన్ కు నిజం తెలిసి.. బామ్మర్ది అని కూడా చూడకుండా కొట్టి.. ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది..?  గురువాయూర్ అంబలనాదయిల్ గుడిలో పెళ్లి చేసుకోవాలనే కల.. వినును తీరిందా.. ? వీరిద్దరికి మధ్య వైరానికి పార్వతి ఎందుకు కారణమైంది.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా మొత్తం ఎంతో కామెడీగా ఉంటుంది. బావబామ్మర్దులు అంటే ఇలానే ఉండాలి అని అనిపించక మానదు. ఇక ముందు వెనుక నిజాలు తెలుసుకోకుండా భార్యను అనుమానించడం మంచిదికాదని ఆనందన్ క్యారెక్టర్ ద్వారా చూపించారు. ఇంకోపక్క ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే.. ఆమెను బ్యాడ్ చేసి క్యారెక్టర్ తప్పుగా చెప్పడం తప్పు అని చూపించారు. దానివలన ఆమె కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటుందో అనేది చూపించారు. ఇక సినిమాకు హైలైట్ అంటే మ్యూజిక్. అంకిత్ మీనన్.. మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే.. ఇప్పుడు ఒక లుక్ వేసేయండి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News