Big Stories

Mahesh Babu: కల్కి 2 లో కృష్ణుడిగా మహేష్ బాబు.. ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఛార్మింగ్ లుక్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అన్ని మైథలాజికల్ ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఎప్పటినుంచో ఇలాంటి కథలో మహేష్ నటిస్తాడు అని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మహేష్.. కృష్ణుడు పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని ఎప్పటినుంచో అనుకుంటున్న మాటనే.

- Advertisement -

ఇక నిన్న రిలీజ్ అయిన కల్కి 2898AD చూసాక.. అభిమానులు మహేష్ ను మరోసారి కృష్ణుడుగా ఊహించేసుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి. ఎన్నో వాయిదాల తరువాత జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తరువాత ప్రభాస్ అంత పెద్ద సక్సెస్ ను అందుకున్నాడు అంటే అది కల్కి వలనే. ఒక్కరోజే రూ. 191. 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

- Advertisement -

ఇక నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఏదైనా షేక్ చేస్తుంది అంటే అది కల్కి క్లైమాక్స్ షాట్ మాత్రమే. అశ్వత్థామను అంతమొందించడానికి అర్జునుడు బాణం వేయడం.. దాన్ని తిప్పి కొడుతూ కర్ణుడు ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే.. కర్ణుడి బలం గురించి కృష్ణుడు.. అర్జునుడు చెప్పడం మరో ఎత్తు. ఇక కృష్ణుడును ముఖం చూపించకుండా చేయడంతో.. ఆ పాత్రలో నటించింది ఎవరో ఆరాలు తీయడం మొదలుపెట్టిన విషయం తెల్సిందే.

చివరికి ఆ పాత్రలో కనిపించింది తమిళ నటుడు కృష్ణకుమార్ అని కూడా తెలిసిపోయింది. కానీ, ఆ కృష్ణుడు గెటప్ లో అభిమానులు కెకె ని కాదు మహేష్ బాబును ఊహించుకుంటున్నారు. కృష్ణుడు గెటప్ లో ఉన్న మహేష్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ క్యారెక్టర్ మహేష్ చేస్తే నెక్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కల్కి 2 లో కృష్ణుడుగా మహేష్ నటిస్తే బావుంటుందని చెప్పుకొస్తున్నారు.  కృష్ణుడుగా మహేష్.. కర్ణుడుగా ప్రభాస్.. ఏమైనా ఉందా కాంబో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి కల్కి పార్ట్ 2 లో కృష్ణుడు అసలు కనిపిస్తాడా.. ? ఒకవేళ కనిపిస్తే ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News