Big Stories

Sharanya: 10 th క్లాస్ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు

Sharanya: అమ్మాయిల శరీర తీరు ఎప్పుడు ఒకేలా ఉండదు. పెళ్లి తరువాత మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టాకా.. ఇక కొంతమంది పెళ్లి తరువాత కూడా తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. ఇంకొంతమంది కొన్ని అనారోగ్య కారణాల వలన బొద్దుగా మారుతారు.. సన్నగా మారతారు. ఇందుకు హీరోయిన్స్ కూడా అతీతం కాదు. ఒకప్పుడు హీరోయిన్స్ గా అలరించినవారు.. పెళ్లిళ్లు చేసుకొని గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.

- Advertisement -

పైన గుండుతో కనిపించిన హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఒకప్పుడు ఆమె హీరోయిన్ గా మంచి సినిమాల్లో నటించింది. ఆమె శరణ్య. ప్రేమిస్తే సినిమాలో సంధ్య స్నేహితురాలిగా నటించి మెప్పించింది. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన శరణ్య.. తెలుగులో 10 th క్లాస్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్నే అందించి పెట్టింది.

- Advertisement -

ఇక ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శరణ్య.. కెరీర్ పీక్స్ లో ఉండగా ఒక వ్యక్తిని ప్రేమించి.. ప్రేమిస్తే సినిమాలోలానే అతనితో వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆమె తల్లి పోలీస్ కేసు కూడా పెట్టింది. కానీ, ప్రేమిస్తే సినిమాలో సాడ్ ఎండింగ్ లా కాకుండా శరణ్య, తన భర్త సంతోషంగా ఉండడంతో ఇరు కుటుంబ వర్గాలు వారి ప్రేమ పెళ్లిని అంగీకరించాయి.

ఇక పెళ్లి తరువాత కూడా శరణ్య సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలోనే ఆమె సినిమాలకు దూరమై భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. కొన్నిరోజులుగా ఆమె.. వరుసగా ఆలయాలను సందర్శిస్తుంది. తాజాగా శరణ్య తమిళనాడు తిరుత్తనిలోని సుబ్రమణ్య స్వామిని దర్శించుకుంది. తలనీలాలు స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శనం బాగా జరిగిందని తెలిపింది. అప్పుడు సన్నగా..నాజూకు తీగలా ఉండే శరణ్య.. ఇప్పుడు బొద్దుగా మారింది. ఇక ఈ గుండులో అయితే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి శరణ్య ముందు ముందు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News