Big Stories

Dil raju: ప్రభాస్ హిట్ అని పార్టీ చేసుకుంటున్నాడు.. కానీ, సినిమా యావరేజ్..

Dil raju: ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట డార్లింగ్ ను చూసి ఇతనేంటి.. హీరో ఏంటి అనుకున్నారు. ఇక వర్షం తో ప్రభాస్ హీరోగా నిలబడ్డాడు. ఛత్రపతి సినిమాతో స్టార్ గా ఎదిగాడు. మధ్యలో ఎన్నో పరాజయాలను అందుకున్నాడు. ఛత్రపతి తరువాత కూడా వరుస ప్లాపులు. మొహమాటం కొద్దీ ఒప్పుకున్న సినిమాలు కొన్ని అయితే.. ప్రేక్షకులు ఆదరించినవి మరికొన్ని. అందులో ఒకటి మున్నా.

- Advertisement -

ప్రభాస్ కెరీర్ లోనే మున్నలో కనిపించినంత ఈజ్ గా ఇంకే సినిమాలో కనిపించలేదు. స్టూడెంట్ గా ప్రభాస్ లుక్ మున్నలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 2007 లో ప్రభాస్- ప్రభాస్ కాంబోలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యియి. యోగి, మున్నా. యోగికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా.. మున్నాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

- Advertisement -

యోగి మొదట రిలీజ్ అయ్యింది. అది యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమా యావరేజ్ అందుకుంది కదా .. మున్నా హిట్ అవుతుందని భావించారు. ఇలియానా అందం, ప్రభాస్ స్టైల్ కు ఫ్యాన్స్ కు ఫిదా అయ్యారు. కానీ, సినిమా మాత్రం యావరేజ్ గానే నిలిచింది. ఇక ఈ విషయాన్నీ దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

” సినిమా తీసేటప్పుడు అంతా బావుంది అనుకున్నాం. రిలీజ్ అయ్యాక ఏదో తేడా కొడుతోంది అని అనిపించింది. ఆ విషయం చెప్దామనే ప్రభాస్ దగ్గరకు వెళ్లాను. అప్పటికే డార్లింగ్.. సినిమా హిట్ అయ్యిందని ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నాడు. నన్ను చూసి నా దగ్గరకు వచ్చి.. సూపర్ స్టార్.. హిట్ కొట్టేసాం అన్నాడు. . అది తప్పు రిపోర్ట్ ప్రభాస్.. సినిమా జస్ట్ యావరేజ్ అవుతుంది అంతే అని చెప్పాను. దానికి ప్రభాస్.. అదేంటి సార్ అంత మాట అన్నారు అన్నాడు. ఆ తరువాత నేను చెప్పినట్టే సినిమా యావరేజ్ గా మిగిలింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలా సినిమాలు విజయాపజయాలను అందుకున్న ప్రభాస్.. నేడు టాక్ తో పనిలేకుండా రికార్డు కలక్షన్స్ అందుకొని పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News