Big Stories

Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు దీపికా చేతి వైపే.. ఎందుకో తెలుసా.. ?

Deepika Padukone: మరో వారం రోజుల్లో కల్కి2898AD ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత చివరకు జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగుతెరకు పరిచయం కానుంది.

- Advertisement -

ఇప్పటికే కల్కి నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నిన్న ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెల్సిందే. రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించిన ఈ ఈవెంట్ కు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్ తో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే కూడా హాజరయ్యింది. బేబీ బంప్ తో కూడా ఆమె ప్రమోషన్స్ కు విచ్చేసి ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

ఇక ఆమె ఈ ఈవెంట్ మొత్తానికి స్ట్రాప్ ఎట్రాక్షన్ గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంతో సింపుల్ గా కనిపించింది. అయితే ఈ ఈవెంట్ లో అందరి చూపు మాత్రం దీపికా చేతి మీద పడింది. ఎందుకంటే ఆమె చేతికి ఉన్న బ్రాస్ లెట్ ఖరీదు అలా ఉంది మరి. కార్టియర్ బ్రాండ్ కి చెందిన ట్రిపుల్ డైమండ్ బ్రాస్‌లెట్ ను ధరించింది. ఈ బ్రాస్ లెట్ ను 18 క్యారెట్ తెల్ల బంగారంతో రూపొందించారట. దీని ధర అక్షరాలా.. రూ. 1.16 కోట్లు ఉంటుందని సమాచారం.

ఇక ఈ ధర విని అభిమానులు కళ్ళు తేలేస్తున్నారు. ఈ ఏడాది అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లిస్ట్ లో దీపికానే మొదటి స్థానంలో ఉంది. ఒక్కో సినిమాకు ఆమె రూ. 20 కోట్లు తీసుకుంటుంది. అంతలా సంపాదించే దీపికాకు ఈ రూ. 1.16 కోట్ల బ్రాస్ లెట్ ఒక లెక్క అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో దీపికా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News