E-Paper
Advertisement

Rama Banam:- గోపీచంద్ ‘రామ బాణం’ సంధింపుకి డేట్ ఫిక్స్

Rama Banam:- గోపీచంద్ ‘రామ బాణం’ సంధింపుకి డేట్ ఫిక్స్
Advertisement

Rama Banam:-టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరున్న గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘రామ బాణం’. శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కి ఓ క్రేజ్ ఉంది. ఇంత‌కు ముందు ల‌క్ష్యం, లౌక్యం సినిమాలు రూపొందాయి. ఈ రెండు మూవీస్ సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ‘రామ బాణం’ చిత్రంపై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌ని గోపీచంద్‌, శ్రీవాస్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ఫిక్స్ చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.

స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా ‘రామ బాణం’ సినిమాను మే 5న విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.
గోపీచంద్ స‌ర‌స‌న డింపుల్ హ‌యాతి హీరోయిన్‌గా న‌టిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ల‌క్ష్యం త‌ర్వాత గోపీచంద్ అన్న‌య్య పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ‘రామ బాణం’ను రూపొందిస్తున్నారు. గోపీచంద్ 30వ సినిమా ఇది. మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

గోపీచంద్‌కి మంచి హిట్ వ‌చ్చి చాలా రోజులే అవుతుంది. అందుక‌నే త‌ను శ్రీవాస్‌తో జ‌త క‌ట్టారు. మ‌రి ఈ కాంబినేష‌న్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందో లేదో చూడాలి. రీసెంట్‌గానే గోపీచంద్ త‌న 31వ చిత్రాన్ని హ‌ర్ష అనే క‌న్న‌డ డైరెక్ట‌ర్‌తో క‌లిసి చేయ‌బోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×