BigTV English

BTS: నాటునాటు సాంగ్ పాడుతూ స్టెప్పులేసిన బీటీఎస్ సింగర్

BTS: నాటునాటు సాంగ్ పాడుతూ స్టెప్పులేసిన బీటీఎస్ సింగర్

BTS: ‘ఆర్ఆర్ఆర్’.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దిగ్గజ హాలీవుడ్ మూవీలను సైతం వెనక్కి నెట్టేసి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఆ మూవీలోని నాటునాటు సాంగ్‌కు వరల్డ్‌‌వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్‌కు కూడా నామినేట్ అయింది. కచ్చితంగా ఈ సాంగ్‌కు ఆస్కార్ వస్తుందని సినీప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇక దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ గురించి తెలిసిందే. ఈ టీమ్‌లోని సింగర్ జంగ్‌కుక్ కూడా నాటునాటు సాంగ్‌కు ఫ్యాన్ అయిపోయాడు. తానే స్వయంగా ఈసాంగ్‌ను ఆలపించాడు. అభిమానులతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో నాటునాటు సాంగ్‌ను పాడుతూ.. సీటులోనే కూర్చొని స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు వీడియో చూసి ఫుల్ ఖషీ అవుతున్నారు.

ఈ వీడియోపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది.వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘‘జంగ్‌కుక్.. ఈ పాటను నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. మీకు, బీటీఎస్ టీమ్‌కు, దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’’ అంటా క్యాప్షన్ ఇచ్చింది.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×