Big Stories

Prabhas – NTR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. కల్కిలో ప్రభాస్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే..?

Prabhas Side Charactor in Kalki – NTR in RRR(Tollywood news in telugu):

ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే.. పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. నెగెటివ్ టాక్ ఇవ్వడానికి కొంతమంది రెడీ అయిపోతారు. అది బాలేదు.. ఇది బాలేదు అంటూ గుచ్చి గుచ్చి చూస్తూ చెప్పుకొస్తారు. కథను తగ్గట్టు, పాత్రకు తగ్గట్టు నటించినా కూడా కొంతమందికి తృప్తి ఉండడం లేదు. హీరో కంటే.. ఇంకోపాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని, ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదని, ఎలివేషన్స్ లేవని.. ఇలా ఏదో ఒకటి చూపించి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు.

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సమయంలో ఎన్టీఆర్ కు ఇలాంటి నెగెటివ్ టాక్ తీసుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ ఒక మల్టీస్టారర్ సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, సినిమాను సినిమాలా చూడని కొంతమంది.. జక్కన్న, రామ్ హారం కు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాడని, ఎన్టీఆర్ కు స్క్రీన్ టైమ్ తక్కువ ఉందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

అంతేకాకుండా మరీ దారుణంగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ అంటూ ట్రోల్ చేశారు. దీనిపై రాజమౌళి కూడా స్పందించాడు. ఒక హీరో ఎక్కువ.. ఒక హీరో తక్కువ అనేది ఏమి లేదని.. తాను ఇద్దరిని సమానంగానే చూపించానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ చాలామంది ఈ విషయమై చర్చించుకుంటున్నారు కూడా. ఇక తాజాగా కల్కి2898AD లో ప్రభాస్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవడం గమనార్హం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Also Read: Prabhas – Kalki 2898 AD: RRRతో సహా.. మరో రేర్ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్‌.. దీన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరు

ఇందులో ప్రభాస్ కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ కానీ, ఇంపార్టెన్స్ కానీ.. మొత్తం అమితాబ్ బచ్చన్ కే ఎక్కువ ఉందని, ఆయనే ఈ సినిమాకు హీరో అని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ ది ఏం లేదని, ఒక సైడ్ క్యారెక్టర్ లా కనిపించాడని అంటున్నారు. నిజం చెప్పాలంటే కథను బట్టి అశ్వత్థామనే ఈ కథకు హీరో.. ఆయన పాయింట్ అఫ్ వ్యూలోనే కథ నడుస్తూ ఉంటుంది. ఆయనే కథకు మెయిన్ హీరో. కానీ, కర్ణగా ప్రభాస్ రివీల్ అయ్యాకే అసలు సినిమా మొదలవుతుంది. అంటే.. సెకండ్ పార్ట్ లో పూర్తిగా ప్రభాస్ కనిపిస్తాడు.

ఒకవిధంగా చెప్పాలంటే నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 1 లో కేవలం పాత్రలను పరిచయం చేసాడనే చెప్పాలి. కథ ఇంకా చెప్పలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం వేస్ట్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ప్రభాస్ ను ఢీకొట్టే హీరో అమితాబ్ కాబట్టి ఎవరు ఏమి అనలేకపోయారు. అది ఆయన రేంజ్ కు తగ్గ పాత్ర. అందుకే ప్రభాస్ తేలిపోయాడు. కథను బట్టే ఆ పాత్రకు అంత వెయిట్ వచ్చిందని అంటున్నారు.

Also Read: Kalki 2898 AD First Day Collections: బాక్సాఫీసు రారాజు.. ప్రభాస్ రాజు.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

కల్కి పార్ట్ 2 లో మొత్తం ప్రభాస్ కు కమల్ కు మధ్య యుద్ధం ఉంటుందని ముందే చెప్పుకొచ్చారు కాబట్టి ఇలాంటి మాటలు వదిలేసి పార్ట్ 2 కోసం ఎదురుచూడమని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి కల్కి పార్ట్ 2 ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్నేళ్లు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News