Big Stories

Rishab Shetty on Karnataka Topper: రికార్డ్ బ్రేక్ చేసిన రైతు కూతురు.. ప్రశంసల పరంపర

Rishab Shetty Congratulations to Karnataka’s 10th Topper: కర్ణాటక రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో రైతు కూతురు స్టేట్ టాపర్ గా నిలిచింది. ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఆమె విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసిస్తున్నారు. కర్ణాటకకు చెందిన సినిమా హీరో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థినిని అభినందించారు.

- Advertisement -

కాగా, ఈ నెల 9న కర్ణాటక రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రైతు కూతురు అంకిత కొనప్ప స్టేట్ టాపర్ గా నిలిచింది. రాష్ట్రంలోని బాగల్ కోట్ జిల్లాకు చెందిన అంకిత కొనప్ప ఎస్ఎస్ఎల్ సీ పరీక్షా ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె నూటికి నూరుశాతం మార్కులు తెచ్చుకోగలిగింది. 625/625 మార్కులు తెచ్చుకుని స్టేట్ టాపర్ గా నిలిచి రికార్డ్ బ్రేక్ చేసింది.

- Advertisement -

అయితే, ఆమె తండ్రి ఒక రైతు, తల్లి గృహిణి. ఆమె స్టేట్ టాపర్ గా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అంకిత స్టేట్ టాపర్ గా నిలవడం పట్ల ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా కూడా సినిమా హీరో రిషబ్ శెట్టి కూడా సోషల్ మీడియా ద్వారా అంకితకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు కూతురు రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా అంకిత విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

Also Read: Ramayanam: హైప్ పెంచేస్తున్న ‘రామాయణం’.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

అయితే, ముధోల్ తాలుకాలో ఉన్న ఓ పాఠశాలలో చదువుకున్న అంకితకు భవిష్యత్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తరువాత కలెక్టర్ కావాలనేది తన లక్ష్యమని పేర్కొన్నట్లు తెలుస్తంది. కాగా, మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా, మొత్తం సుమారు 8 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని, మొత్తం 6,31,204 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈసారి ఉత్తీర్ణత శాతం 73.40 % అని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈసారి పదో తరగతి ఫలితాల్లో బాలురు కంటే బాలికలదే పైచేయి అని పేర్కొన్నది. ఫలితాల్లో 81.11 శాతం మంది బాలికలు, 65.90 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News