Big Stories

Love Mouli: ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. ఇంట్లో వాళ్ళతో చూసేరు.. తాట తీస్తారు

Love Mouli: యంగ్ హీరో నవదీప్ ఒకపక్క హీరోగా ..ఇంకోపక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెల్సిందే. చాలా గ్యాప్ తరువాత నవదీప్.. హీరోగా తెరకెక్కిన చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్ సరసన పంఘరి గిద్వాని నటించింది. ఈ సినిమా మొదటి పోస్టర్ రిలీజ్ అప్పటినుంచే హైప్ క్రియేట్ చేసుకుంది.

- Advertisement -

నవదీప్ లుక్, హీరోయిన్ తో రొమాన్స్ .. ఇలా ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు మంచి హైప్ ఇచ్చిన ఈ సినిమా జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ కంటెంట్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఎందుకో ఈ సినిమాను ఆదరించలేకపోయారు. ఇక దాదాపు 20 రోజుల తరువాత ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఎప్పటినుంచో లవ్ మౌళి ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

- Advertisement -

మొన్నటివరకు స్ట్రీమింగ్ డేట్ చెప్పకుండా పోస్టర్లు వదిలిన ఆహా, తాజాగా లవ్ మౌళి స్ట్రీమింగ్ డేట్ ను చెప్పుకొచ్చింది. జూన్ 27 నుంచి లవ్ మౌళి ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరో రానా దగ్గుబాటి ఒక ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు.

థియేటర్ లో రానాను చూసి అభిమానులు ఖంగు తిన్నారు. నవదీప్ యాక్టింగ్ బావున్నా.. కంటెంట్ కొద్దిగా తేడా కొట్టడంతో మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక ఈ పోస్టర్ కింద అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కుటుంబ కథా చిత్రం అనుకోని ఇంట్లో వాళ్ళతో కలిసి చూడకండి రా .. తాట తీస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News